Latest Posts

వారఫలితాలు తేదీ 16 సెప్టెంబర్ శుక్రవారం నుండి 22 గురువారం 2022 వరకు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . డా.ఎం.ఎన్.ఆచార్య

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు, జైశ్రీమన్నారాయణ.

ఈ వారం మొదట్లో ఏ పనిపైనా ఏకాగ్రత ఉండదు. శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. క్రమేపీ వీటిని అధిగమించి ముందుకు సాగుతారు. కొంత సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో అనుకున్న హోదాలు సాధిస్తారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. ఖర్చులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. బంధు మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు ఉన్నా సమర్థతను చాటుకుంటారు.

పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం దీర్ఘకాలిక రుణబాధలు తీరి ఉపశమనం పొందుతారు. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు అనుకున్నదానికంటే మెరుగుపడి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే అవకాశం. ఇంటి నిర్మాణాలలో అవరోధాలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది.

కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం ముఖ్యమైన పనుల్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారే సమయం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు గతం కంటే ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం.

బంధువులతో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులతో రుణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కొన్ని నిర్ణయాలపై ఆలోచనలో పడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు మరింత శ్రమపడాలి. వ్యాపారాలు సామాన్యంగానే కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. కళారంగం వారికి కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నూతన ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. విద్యావకాశాలు దక్కి విద్యార్థులకు ఊరట కలుగుతుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కవచ్చు.

రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

ఉద్యోగాలలో ఒత్తిడులు, ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఈ వారం పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి.

కళారంగం వారికి విదేశీ పర్యటనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Latest Posts

Don't Miss