Latest Posts

కొత్త వేరియంట్ హై టెన్షన్, రాష్ట్రంలో కొత్త కేసులు ఎన్నంటే..?

ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో కాస్త టైన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ‌ రాష్ట్రంలో గురువారం 114 క‌రోనా కేసులు వచ్చాయి. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 10,804 క‌రోనా నిర్ధార‌ణ పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా… 114 కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసుల‌తో తెలంగాణ‌లో ఇప్ప‌టిదాకా మొత్తంగా 8,36,411 క‌రోనా కేసులు న‌మోదు అయిన‌ట్టయింది.

366 మందికి సంబంధించిన వైద్య ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. హైద‌రాబాద్ ప‌రిధిలోనే 48 కేసులు న‌మోదు కాగా… కేసులు న‌మోదైన మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులే న‌మోద‌య్యాయి. హైద‌రాబాద్‌లో రోజుకో కేసు చొప్పున క‌రోనా కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. మంగ‌ళ‌వారం 50 కేసులు న‌మోదు కాగా.. బుధ‌వారం 49 కేసులు న‌మోద‌య్యాయి. గురువారం మ‌రో కేసు త‌గ్గి 48 కేసులే న‌మోద‌య్యాయి.

గురువారం క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ఒక్క మ‌ర‌ణం సంభ‌వించ‌లేదు. క‌రోనా వల్ల చ‌నిపోయిన వారి సంఖ్య‌ 4,111లో ఎలాంటి మార్పు లేదు. గురువారం క‌రోనా బారిన ప‌డిన వారిలో 130 మంది వైర‌స్ నుంచి విముక్తి పొందారు. దీంతో ఇప్ప‌టిదాకా క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారి సంఖ్య‌ 8,31,508కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 792 మంది క‌రోనా చికిత్స‌ తీసుకుంటున్నారు.

Latest Posts

Don't Miss