Latest Posts

Vikram 100 Days: విక్రమ్ 100 డేస్ కలెక్షన్లు.. టోటల్‌గా అన్ని వందల కోట్లు.. తెలుగులో సంచలన రికార్డు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతూ.. ఇప్పటికీ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు విశ్వ నాయకుడు కమల్ హాసన్. అదిరిపోయే యాక్టింగ్‌, మర్చిపోలేని చిత్రాలతో ప్రయోగాలు చేస్తోన్న ఆయన.. కుర్రాళ్లు కూడా చేయలేనంత స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. అయితే, చాలా కాలంగా కమల్ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఆయన ‘విక్రమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా టాక్ పరంగా, కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసింది. దీంతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ‘విక్రమ్’ 100 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే ‘విక్రమ్’. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.

డెలివరీ తర్వాత తొలిసారి బికినీలో ప్రణిత: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘విక్రమ్’కు తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ దీని హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 100 కోట్ల మేర బిజినెస్‌‌ జరిగింది.

సీనియర్ హీరో కమల్ హాసన్‌ నటించిన తాజా చిత్రమే ‘విక్రమ్’. సుదీర్ఘ కాలంగా విజయం కోసం ఎదురు చూస్తోన్న ఆయనకు ఈ మూవీ సర్‌ప్రైజింగ్ హిట్‌ను అందించింది. ఇది ఏ ఒక్క ప్రాంతంలోనో కాదు.. రిలీజైన అన్ని భాషల్లోనూ భారీ కలెక్షన్లను రాబట్టి సత్తా చాటింది. ఇలా నేటికి ఈ మూవీ వంద రోజుల పూర్తి చేసుకుంది. దాదాపు పది సెంటర్లలో ఇది ఈ ఫీట్ సాధించింది.

Bigg Boss Telugu 6: షోలో గీతూ ఊహించని పని.. అందరి ముందే బట్టలు విప్పేసి మరీ!

100 రోజుల్లో ‘విక్రమ్’ ఆంధ్రా, తెలంగాణలో భారీగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 7.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.32 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 86 లక్షలు, గుంటూరులో రూ. 1.22 కోట్లు, కృష్ణాలో రూ. 1.50 కోట్లు, నెల్లూరులో రూ. 62 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 17.80 కోట్లు షేర్, రూ. 31.40 కోట్లు గ్రాస్ దక్కింది.

కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ మూవీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన థియేట్రికల్ హక్కులను యూత్ స్టార్ నితిన్ రూ. 7 కోట్లకు కొన్నాడు. దీంతో దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వంద రోజుల్లో రూ. 17.80 కోట్లు వసూలు చేసింది. అంటే ఈ చిత్రం ద్వారా నితిన్‌కు ఏకంగా రూ. 10.30 కోట్లు మేర లాభాలు సొంతం అయ్యాయి.

శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

‘విక్రమ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో వంద రోజుల్లో ఇది తమిళనాడులో రూ. 182.50 కోట్లు, కర్నాటకలో రూ. 22.10, ఓవర్సీస్‌‌లో రూ. 126 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.50 కోట్లు, కేరళలో రూ. 40.60 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. అంటే మొత్తంగా 100 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 417.10 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 210 కోట్లు షేర్ రాబట్టింది.

విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 102 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 100 రోజుల్లోనే రూ. 210 కోట్లు వచ్చాయి. అంటే ఈ మూవీకి రూ. 108 కోట్లు వరకూ లాభాలు దక్కాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Latest Posts

Don't Miss