విశ్వ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద గత పదేళ్ళుగా అయినా సరైన సక్సెస్ చూడలేదు. ఎలాంటి సినిమా చేసిన కూడా పూర్తిస్థాయిలో అయితే అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఇక మొత్తానికి విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ చేశాడు. ఆయన సొంత నిర్మాణంలో లోకేష్ కనగరాజ్ తెరపైకి తీసుకువచ్చిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి ఊహించని రేంజ్ లో అయితే ప్రాఫిట్స్ అందించింది.
పాన్ ఇండియా సినిమాగా యువ దర్శకుడు లోకేష్ తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని.. తమిళనాడులో అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలిచి పాత రికార్డులను కూడా బ్రేక్ చేసింది. అలాగే కేరళ కర్ణాటక ఓవర్సీస్ లో కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ సినిమా నేటితో వంద రోజులను పూర్తిచేసుకుంది. 100 రోజులైనా ఇంకా తమిళనాడు థియేటర్లలో నదిస్తోంది అంటే క్రేజ్ ఎలా ఉందో చెప్పవచ్చు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఒక స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి కూడా కమల్ హాసన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం కూడా ఎంతగానో ఉపయోగపడింది. అంతే కాకుండా విజయ్ సేతుపతి బలమైన విలన్ పాత్రలో కనిపించడం అలాగే ఫాహాద్ నటన కూడా సినిమాలో హైలెట్ గా నిలిచింది.
100 days of winning hearts & setting new milestones at the box office. #100DaysofVikram#VikramRoaringSuccess @ikamalhaasan @Udhaystalin @Dir_Lokesh @Suriya_offl @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial #Mahendran @RKFI @turmericmediaTM pic.twitter.com/OeLykYjR9v
ఇక చివరిలో సూర్యా నటించిన రోలెక్స్ క్యారెక్టర్ కూడా జనాలకు బాగా నచ్చేసింది. దీంతో సినిమా మొదటి నుంచి చివరి వరకు కూడా థియేటర్లో విజిల్ వేయించే విధంగా ఆకట్టుకుంది. సినిమా మొత్తంగా ఊహించని రేంజ్ లో అయితే ప్రాఫిట్స్ అందించింది. వరల్డ్ వైడ్ గా 417 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఇక దాదాపు 100 కోట్ల వరకు బిజినెస్ చేయరా పెట్టిన పెట్టుబడి నిర్మాతలకు 108 కోట్ల వరకు ప్రాఫిట్ అందించినట్లు సమాచారం. ఇక తెలుగులో ఈ సినిమాను నితిన్ హోమ్ ప్రొడక్షన్ శ్రేష్ట మూవీస్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక వారికి కూడా ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి లాభాలను అందించి.. ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్ అందుకున్న సినిమాలలో ఒకటిగా విక్రమ్ నిలిచింది.