For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Thursday, September 15, 2022, 16:33 [IST]
UPI Transaction Limit: ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడిన తర్వాత ఎక్కువగా యూపీఐ యాప్స్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది డెబిట్ కార్డులను వినియోగించటం మానేశారు. క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులు చేయటం కూడా అందుబాటులోకి వస్తున్న తరుణంలో బ్యాంకులు రోజువారీ లావాదేవీలకు పరిమితులు పెడుతున్నారు. ఇవి వివిధ బ్యాంకులకు వేరువేరుగా ఉన్నాయి.
విదేశాలకూ యూపీఐ చెల్లింపులు..
ఆగస్టులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా 657 కోట్ల లావాదేవీలు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం.. నెలవారీగా లావాదేవీలు విలువ 4.6 శాతం పెరిగాయి. దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు విధిస్తున్న రోజువారీ చెల్లింపు పరిమితుల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
బ్యాంకుల వారీగా వివరాలు..
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – దేశంలోని అతిపెద్ద బ్యాంక్ UPI లావాదేవీ పరిమితి రోజుకు రూ.లక్షగా నిర్ణయించింది.
- HDFC బ్యాంక్ – అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ UPI లావాదేవీ, రోజువారీ పరిమితిని రూ.లక్షగా ఉంచింది. అయితే.. కొత్త కస్టమర్ మొదటి 24 గంటల్లో కేవలం రూ.5,000 లావాదేవీని మాత్రమే చేయగలరు.
-
ICICI బ్యాంక్- బ్యాంక్ UPI లావాదేవీ రోజువారీ పరిమితి కూడా రూ.10,000గా ఉంది. అయినప్పటికీ Google Pay వినియోగదారులకు ఈ పరిమితి రూ.25,000గా బ్యాంక్ నిర్ణయించింది.
-
యాక్సిస్ బ్యాంక్- UPI లావాదేవీ పరిమితి, బ్యాంక్ రోజువారీ పరిమితి రూ.లక్ష రూపాయలని బ్యాంక్ నిర్ణయించింది.
-
బ్యాంక్ ఆఫ్ బరోడా – బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకే సారి లావాదేవీ పరిమితిని రూ.25 వేలుగా నిర్ణయించింది. అయితే రోజువారీ లావాదేవీల పరిమితిని రూ.లక్షగా నిర్ణయించింది.
English summary
know upi transaction daily limits of sbi, hdfc, icici, axis banks
know upi transaction daily limits of sbi, hdfc, icici, axis banks
Story first published: Thursday, September 15, 2022, 16:33 [IST]