Latest Posts

Thank God Case: రకుల్ ప్రీత్ సింగ్ సినిమాపై కేసు నమోదు.. ఆ డ్రెస్‌తో అలాంటివి వాడడంతో!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ తరహా సినిమాలకు ఆదరణ ఎక్కువగా లభిస్తుంది. దీంతో అక్కడి హీరోలు ఇలాంటి మూవీలు చేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు. అందుకు అనుగుణంగానే దర్శక నిర్మాతలు కూడా కొత్త ప్రాజెక్టులతో వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రా కలిసి నటించిన చిత్రమే ‘థ్యాంక్ గాడ్’. క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా బజ్ ఏర్పడిన విషయం తెలిసిందే.

శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘థ్యాంక్ గాడ్’ మూవీపై ఆరంభం నుంచే అందరూ దృష్టి సారించారు. దీనికి కారణం ఇందులో హిందూ మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలు చాలా ఉన్నాయని మొదటి నుంచీ ప్రచారం జరగడమే. దీంతో ఈ సినిమాను నిషేదించాలని చాలా మంది నెటిజన్ల ట్విట్టర్ ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు. ఫలితంగా ఈ మూవీ గురించి అందరూ చర్చించుకునే పరిస్తితులు వచ్చాయి. అయినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని పట్టుదలగా పని చేస్తోంది.

‘థ్యాంక్ గాడ్’ మూవీని అక్టోబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ వీడియోలో చూపించిన కొన్ని సన్నివేశాలను హిందుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా చిత్ర గుప్తుని పాత్రను పోషించిన అజయ్ దేవగణ్ సూటు ధరించడం.. ఆయన చుట్టూ కొందరు అమ్మాయిలు కనిపించడం.. అలాగే, ఈ స్టార్ హీరో నోట కొన్ని అసభ్యకరమైన పదాలు రావడంతో కొందరు హిందువులు చిత్ర యూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!

ఇక, తాజాగా ‘థ్యాంక్ గాడ్’ మూవీ ట్రైలర్‌లోని అభ్యంతరకర సన్నివేశాలను ప్రస్తావిస్తూ ప్రముఖ న్యాయవాది హిమాన్షు శ్రీ వాస్తవ ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. దీంతో ఈ చిత్ర యూనిట్‌పై కేసు నమోదైంది. అంతేకాదు, నవంబర్ 18వ తేదీన పిటిషనర్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని కోర్టు వెల్లడించింది. దీంతో ‘థ్యాంక్ గాడ్’ మూవీ యూనిట్ చిక్కుల్లో పడిపోయింది. ఇక, దీనిపై దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అందులో చాలా మంది ఈ చిత్రానికి వ్యతిరేకంగా తమ వాదనను వినిపిస్తున్నారు. దీంతో ఈ మూవీ విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. అజయ్ దేవగణ్, సిద్దార్థ్ మల్హోత్రా కలిసి నటించిన చిత్రమే ‘థ్యాంక్ గాడ్’. ఇంద్ర కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్‌తో పాటు కొన్ని బ్యానర్లుపై భూషన్ కుమార్, కృష్ణన్ కుమార్ సహా పలువురు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు.

Latest Posts

Don't Miss