For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Thursday, September 15, 2022, 13:22 [IST]
Success Story: సాధారణంగా మధ్యతరగతి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చే వ్యక్తులు సురక్షితమైన, శాశ్వతమైన ఉద్యోగం పొంది స్థిరపడాలనుకుంటారు. 1970-80ల కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఊహించవచ్చు. కానీ ఒక వ్యక్తి వీటికి భిన్నంగా వ్యాపారాన్ని స్థాపించి నేడు దేశంలో ప్రఖ్యాత కంపెనీగా దాన్ని తీర్చిదిద్దారు.
V-Guard ప్రారంభం..
1977లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొచౌసుఫ్ చిటిలపిల్లి తన తండ్రి థామస్‌ని కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లక్ష రూపాయలు అడిగారు. వారిది పరపూర్ కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామం. కానీ అతని తండ్రి వ్యాపారం వద్దు, ఉద్యోగం చేసుకోమని సూచించారు. కొచౌసుఫ్ మాత్రం పట్టువదలక కొచ్చిలోని తన ఇంటి దగ్గర 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో తన కంపెనీని ప్రారంభించారు.
కేరళ విద్యుత్..
ఆ సమయంలో కేరళలో విద్యుత్ సరఫరాలో ఓల్టేజీ అస్తవ్యస్తంగా ఉండేది. ఆ సమస్య తనకు వ్యాపార అవకాశంగా మలుచుకున్నారు. అలా ముగ్గురు- నలుగురు ఉద్యోగులతో వోల్టేజ్ స్టెబిలైజర్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించారు. టీవీలు, రిఫ్రిజిరేటర్లకు, మ్యూజిక్ సిస్టమ్స్ డిమాండ్ పెరుగుతున్న ఆ సమయంలో వారి వ్యాపారం పుంజుకుంది. అలా VGuard కొన్ని వారాల్లోనే భారీ ప్రజాదరణ పొందాయి.
ఇతర రాష్ట్రాల్లో తయారీ..
VGuard వోల్టేజ్ స్టెబిలైజర్ల ఉత్పత్తిలో భాగంగా కేరళ, తమిళనాడు, ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్లలో తయారీ యూనిట్లను నెలకొల్పారు. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా 29 శాఖలు, 3,500 మంది ఉద్యోగులను కలిగిఉంది. 2021-22లో అమ్మకాల ద్వారా VGuard ఆదాయం రూ.3,498 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం కంపెనీ ఈ మార్కెట్లో 20 శాతం వాటాను కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీకి భారీగా వినియోగదారులు ఉన్నారు.
వండర్లా థీమ్ పార్కు..
2000 సంవత్సరంలో కొచ్చౌస్ సిటిలపిల్లి వాటర్ థీమ్ పార్కులపై మోజు పెంచుకున్నారు. వాటర్ థీమ్ పార్కులను మొదట్లో వీగాలాండ్ పేరుతో అభివృద్ధి చేశారు. తరువాత వాటి పేరును వండర్‌లాగా మార్చారు. కొచ్చి, బెంగుళూరు, హైదరాబాద్ లలో ప్రస్తుతం థీమ్ పార్కులు ఉన్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.282 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
నవతరం చేతిలో..
కొచ్చౌస్ఫ్ చిట్టిలపిల్లి కుమారులు మిథున్ చిట్టిలప్పిల్లి, అరుణ్ చిట్టిలప్పిల్లితో కలిసి VGuard సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. మిథున్ చిట్టిలప్పిల్లిలో VGuard ఇండస్ట్రీస్ బాధ్యతలు చూసుకుంటుండగా.. మరో తనయుడు అరుణ్ చిట్టిలప్పిల్లిలో వండర్లా వ్యాపారాన్ని నడుపుతున్నారు.
English summary
know about V-Guard company success story started by Kochouseph Chittilappilly with one lakh
know about V-Guard company success story started by Kochouseph Chittilappilly with one lakh
Story first published: Thursday, September 15, 2022, 13:22 [IST]