For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Thursday, September 15, 2022, 16:45 [IST]
Stock Market Fall: ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. తీవ్ర ఒడిదొడుకుల కారణంగా చివరికి సూచీలు భారీ నష్టాలను నమోదు చేశాయి. దేశంతో పాటు అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని సెంట్రల్ బ్యాంకులు తీవ్రంగా పరిగణిస్తాయనే అంచనాల నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు మెుగ్గుచూపారు. ఇదే సమయంలో నేడు వారాంతపు ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఎక్స్ పైరీ కావటం కూడా మార్కెట్లపై ఎక్కువ ప్రభావాన్ని చూపింది.
మార్కెట్ల ముగింపు..
ఉదయం ఆరంభంలో 280 పాయింట్ల లాభంలో ఉన్న సెన్సెక్స్ సూచీ మార్కెట్లు ముగిసే సమయానికి 413 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 70 పాయింట్లకు పైగా లాభాల్లో ప్రారంభమైనప్పటికీ చివరికి 126 పాయింట్లు నష్టపోయింది. ఇదే సమయంలో మార్కెట్ క్లోజింగ్ సమయానికి బ్యాంక్ నిఫ్టీ 196 పాయింట్లు కోల్పోయింది. కానీ ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం అనూహ్యంగా 130 పాయింట్ల లాభంలో ముగిసింది.
నష్టపోయిన ప్రధాన రంగాలు..
ఈ రోజు మార్కెట్లో ప్రధానంగా ఆటో, మెటల్, పీఎస్ యూ బ్యాంకులతో పాటు అన్ని సెక్టార్ల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇదే సమయంలో ఐటీ, ఫార్మా రంగాలు మార్కెట్లను వెనక్కు లాగటంతో చివరికి సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఇదే సమయంలో ఫిట్ భారత జీడీపీ వృద్ధి రేటును తగ్గించటం కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది.
టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
మార్కెట్లు ముగిసే సమయానికి మారుతీ, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, కోల్ ఇండియా, ఎల్అండ్ టీ, ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు లాభాల్లో ఉండి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే క్రమంలో.. హిందాల్కొ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, హీరోమోటో కార్ప్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, దివీ ల్యాబ్స్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్ తో పాటి మరిన్నిస్టాక్స్ టాప్ లూజర్స్ గా నేడు ట్రేడింగ్ ముగించాయి.
English summary
indian stock markets closed in losses being opened positively major indices in red
indian stock markets closed in losses being opened positively major indices in red
Story first published: Thursday, September 15, 2022, 16:45 [IST]