For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Thursday, September 15, 2022, 12:33 [IST]
SBI: గత కొన్ని నెలలుగా వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తన బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును 70 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో వాటి రేట్లు వరుసగా 8.7%, 13.45%కి పెరిగింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 15, 2022 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ వెల్లించింది. ఈ రేట్లను చివరగా జూన్ 15న SBI పెంచింది. బ్యాంకులు రుణాలను పంపిణీ చేయడానికి ఉపయోగించే పాత బెంచ్‌మార్క్‌లు ఇవి. వినియోగదారులపై ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు గమనిద్దాం.
బ్యాంక్ బేస్ రేటు అంటే?
బేస్ రేటు అనేది కస్టమర్లకు రుణాలను అందించటానికి బ్యాంకులు నిర్ణయించే కనీస వడ్డీ రేటు. దీని పెంపు కారణంగా పాత ఫ్రోటింగ్ రేటు లోన్స్ అకౌంట్స్ ఉన్నవారు చెల్లించాల్సిన వడ్డీ రేటు పెరుగుతుంది. కారణంగా వారు పెరిగిన లోన్ ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలు (EMI) చెల్లిస్తారు లేదా వారి లోన్ చెల్లింపు కాలవ్యవధి పొడిగించబడతారు.
బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు అంటే ఏమిటి?
"బెంచ్‌మార్క్ రేటు" అనే పదం రుణ వడ్డీ రేట్లను లెక్కించడానికి ఉపయోగించే ప్రామాణిక రేటును సూచిస్తుంది. RBI ప్రకారం.. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) అంటే జూన్ 30, 2010 వరకు మంజూరు చేయబడిన అడ్వాన్స్‌లు/రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఉపయోగించే అంతర్గత బెంచ్‌మార్క్ రేటు.
ఆర్బీఐ రేట్ల పోటు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పాలసీ సమీక్షలో రెపో రేటును 0.5 శాతం పెంచింది. ఈ ఏడాది ప్రారంభంలో వడ్డీ రేట్లను పెంచినప్పటి నుంచి ఆర్బిఐ వరుసగా మూడు సార్లు వడ్డీ రేట్లను పెంపును కొనసాగించింది. ఈ నెల చివరిలో కూడా మళ్లీ వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా తాజా ద్రవ్యోల్బణం గణాంకాలు వీరి అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి.
English summary
SBI hikes base rate, Benchmark Prime Lending Rate impact loan takers know details
SBI hikes base rate, Benchmark Prime Lending Rate impact loan takers know details
Story first published: Thursday, September 15, 2022, 12:33 [IST]