Latest Posts

Samantha Ruth Prabhu హాలీవుడ్ సినిమా.. దర్శకుడు ఎవరంటే? శాకిని డాకిని నిర్మాత సునీత తాటి వెల్లడి (ఇంటర్వ్యూ)

నిర్మాతగా నాకు శాకిని డాకిని ఏడో సినిమా. కొరియన్ సినిమాను ఆధారంగా చేసుకొని నిర్మించాం. కొరియన్ భాషలో ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు చేశారు. అయితే తెలుగులో చేయాలనుకొన్నప్పుడు హీరోలు సెట్ కాలేదు. దాంతో హీరోయిన్లతో మల్టీ స్టారర్ చేయాలని ఫిక్స్ అయ్యాం. నివేదా థామస్, రెజీనా ఫైనల్ కాకముందే సుధీర్ వర్మను దర్శకుడిగా ఫైనల్ చేశాం. దాంతో డైరెక్టర్ సుధీర్ వర్మ ఐడియా బాగుందని చెప్పింది. మిడ్‌నైట్ రన్నర్ సినిమా ఆధారంగా రూపొందించిన చిత్రంలో హీరోలు రాత్రంతా పరిగెత్తుతుంటారు. ఈ సినిమాలో హీరోయిన్లు కూడా పరుగెత్తుతూనే ఉంటారు. ఒక్క రాత్రి జరిగే కథనే ఈ సినిమా అని సునీత తాటి చెప్పారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..

శాకిని డాకిని సినిమా చేయాలని అనుకొన్నప్పుడు నివేదా థామస్, రెజీనానే అనుకొన్నాం. రెజీనాను ఫైనల్ చేసిన తర్వాత నివేదా థామస్‌ను తీసుకోవడానికి రెండు నెలలు టైమ్ తీసుకొన్నాం. ఒకరు అథ్లెటిక్, ఒకరు నివేదా థామస్ ఫుడీ. ఇద్దరి ఫైట్స్ బాగుంటాయి. నివేదా చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ప్రతీ తండ్రి తన కూతురును తీసుకెళ్లి చూపించాల్సిన సినిమా అని సునీత తాటి అన్నారు.

ఏ మహిళకైనా ఫెర్టిలిటి 18 ఏళ్ల వయసులో జరుగుతుంది. అందుకే ఆ వయసులోనే గతంలో పెళ్లిల్లు చేయడం మనకు తెలుసు. ఈ సినిమాలో ఆ పాయింట్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ సినిమా చేస్తే ఒక ఫీల్ ఉంటుంది. ఎమోషనల్‌గా ఆకట్టుకొంటున్నది. సుధీర్ వర్మ ఈ సినిమాను మంచి ప్రమాణాలతో రూపొందించారు. సుధీర్‌లో విజువలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ డైరెక్టర్ అతను. అతడిలో ఓ స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ఈ సినిమాలో మిస్ కాదు అని సునీత తాటి అన్నారు.

శాకిని డాకిని సినిమాలో చాలా ఎనర్జీని పెట్టాం. టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సమంతతో చేస్తే బాగుండేది. కానీ స్టార్‌తో చేస్తే బడ్జెట్ పెరిగేది. ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుంది. సుధీర్ వర్మ మరో సినిమా బిజీగా ఉన్నారు. రవితేజతో సినిమా వల్ల ప్రమోషన్స్‌కు రావడం లేదు. 15వ తేదీ నుంచి ఆయన ప్రమోషన్స్ చేస్తారు అని సునీత తాటి చెప్పారు.

కోవిడ్ పరిస్థితులు వల్ల శాకిని డాకిని సినిమా రిలీజ్ కాస్త వాయిదా పడింది. మంచి సమయం కోసం ఎదురు చూశాం. ప్రతీ వారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కోవిడ్ తర్వాత కట్టకట్టుకొని రిలీజ్ అవుతున్నాయి. వాస్తవానికి అక్టోబర్‌‌లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. హీరోయిన్ల వల్ల డేట్స్ ఇష్యూ రాలేదు. వకీల్ సాబ్ సమయంలో నివేదా థామస్ ప్రమోషన్స్‌లో పాల్గొనడం వల్ల కరోనా బారిన పడ్డారు. అలాంటి చిన్న చిన్న ఇష్యూ వచ్చాయి. అవేమీ సినిమాకు అడ్డం కాలేదు అని సునీత చెప్పారు.

థియేటర్‌లో సినిమా చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. ఎవరితో చూశాం. ఎప్పుడు చూశాం. థియేటర్‌కు వెళ్లినప్పుడు ఏం తిన్నాం. ఓటీటీలో సినిమా చూస్తే పెద్దగా అనుభూతి ఉండదు. ఖాళీ సమయంలో మనకు ఇష్టం వచ్చినట్టు చూస్తాం. అయితే అది పెద్దగా గుర్తు ఉండదు. ఎప్పటికైనా థియేట్రికల్ రిలీజ్, ఎక్స్‌పీరియెన్స్ గొప్పగా ఉంటుంది అని సునీత తాటి అన్నారు.

మొత్తం ఆరు సినిమాలు చేస్తున్నాం. లక్కీ అనే సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా కొన్ని సినిమాలు ప్రకటిస్తున్నాం. సమంతతో హాలీవుడ్ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా టైటిల్ అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్. త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం. రెండు సినిమాలకు డైరెక్ట్ చేస్తున్నాను. సమంత సినిమాకు లండన్‌కు చెందిన ఫిల్ జానన్ దర్శకత్వం వహిస్తారు. మార్చి నుంచి సమంత సినిమా ప్రారంభం అవుతుంద అని సునీత తాటి చెప్పారు. టొరెంటో ఫిలిం ఫెస్టివల్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నామన్నారు.

Latest Posts

Don't Miss