Latest Posts

Revenge: వాడే హీరో, వాడే విలన్, కిలాడీ లేడికి రూ. 8 లక్షలు ఇచ్చి ?, పగతో ఏం చేశాడంటే ?

బెంగళూరు/మండ్య/గోవా: ఓ యువకుడు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. లక్షల రూపాయలు వడ్డీలకు ఇచ్చిన ఆ యువకుడు ప్రతినెల లక్షల్లో వడ్డీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓ కిలాడీ లేడీకి భారీ మొత్తంలో లక్షల రూపాయల అప్పు ఇచ్చాడు. ఇటీవల ఫైనాన్స్ వ్యాపారాం చేస్తున్న వ్యక్తి ఇల్లు మొత్తం రక్తపు మరకలు కావడంతో పాటు ఇంట్లో కాలిపోయిన తల కనపడింది. కొన్ని కిలోమీటర్ల దూరంలోని నదిపక్కన ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న యువకుడు వేసుకునే చెప్పులు కనపడ్డాయి. ఫైనాన్స్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అతన్ని హత్య చేశారని అందరూ నమ్మేశారు. ఫైనాన్స్ వ్యాపారి కేసులో అనేక మందిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పైనాన్సియర్ హత్యకు గురైనాడని అందరూ డిసైడ్ అయ్యారు. ఇదే సందర్బంలో పోలీసులకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయి.

Sadist: భార్య కాళ్లు, చేతులు కట్టేసి ప్రైవేట్ పార్ట్ లో ఫెవికిక్ వేసిన భర్త, మ్యాటర్ తెలిసి షాక్, వీడు మొగుడేSadist: భార్య కాళ్లు, చేతులు కట్టేసి ప్రైవేట్ పార్ట్ లో ఫెవికిక్ వేసిన భర్త, మ్యాటర్ తెలిసి షాక్, వీడు మొగుడే

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలుకాలోని చోట్టనహళ్ళి గ్రామంలో మను అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి మను ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. లక్షల రూపాయలు వడ్డీలకు ఇచ్చిన మను ప్రతినెల లక్షల్లో వడ్డీ డబ్బులు వసూలు చేసుకుని సంతోషంగా జీవిస్తున్నాడు.

మండ్యలో నివాసం ఉంటున్న సుప్రియా అనే మహిళ మనును తనకు రూ. 8 లక్షలు అప్పు కావాలని అడిగింది. సుప్రియా అందచందాలు చూసి సొల్లు కార్చుకున్న మను ఆమెకు డబ్బులు ఇవ్వడానికి సిద్దం అయ్యాడు. అయితే సుప్రియా దగ్గర ప్రామ్సరి నోట్ రాసుకుని, ఆమె దగ్గర బ్యాంక్ చెక్కులు తీసుకున్న మను ఆమెకు రూ. 8 లక్షలు అప్పుగా ఇచ్చాడు.

సుప్రియాకు అప్పు ఇచ్చిన మను ఆమె ఇంటికి అప్పుడప్పుడు వెళ్లి గంటలు గంటలు కాలం గడుపుతున్నాడు. 20 రోజుల క్రితం మను నివాసం ఉంటున్న ఇల్లు మొత్తం రక్తపు మరకలతో దర్శనం ఇచ్చింది. మను ఇంట్లో కాలిపోయిన ఓ తల కనపడింది. కొన్ని కిలోమీటర్ల దూరంలోని నదిపక్కన ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న మను వేసుకునే చెప్పులు కనపడ్డాయి.

ఫైనాన్స్ వ్యాపారి మనును కిడ్నాప్ చేసి హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. పోలీసులు కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసి విచారణ చేశారు. మను హత్యకు గురైనాడని అందరూ నమ్మేశారు. ఫైనాన్స్ వ్యాపారి మను దగ్గర డబ్బుల లావాదేవీలు ఉన్న అనేక మందిని ఇదే కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు.

కేసు విచారణ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చింది. మను మొబైల్ ఫోన్ నెంబర్ లోకేష్ ట్రేస్ చేస్తే అతను బెంగళూరులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని ఓ పీజీలో హ్యీపీగా ఉన్న మనును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.

విచారణలో పోలీసులకు దిమ్మతిరిగిపోయే విషయాలు తెలిశాయి.

రూ. 8 లక్షలు అప్పుగా తీసుకున్న సుప్రియా ఆమె మరో బాయ్ ఫ్రెండ్ తో కలిసి తన దగ్గర ఉన్న చెక్ లు ఇవ్వాలని పదేపదే బెదిరించారని, చెక్కులు ఇచ్చేసిన తరువాత డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలని తనను బెదిరించారని, వారికి బుద్ది చెప్పాలని, సుప్రియా, ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా పోలీసుల దెబ్బతో నరకం చూడాలని తాను కిడ్నాప్ అయ్యానని, హత్యకు గురైనానని నేనే కట్టుకథ అల్లానని మను అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

కోడి రక్తం ఇల్లు మొత్తం చల్లానని, తరువాత మనిషి తల విగ్ కాల్చి నాటకాలు ఆడానని, 10 రోజుల పాటు గోవాలో ఎంజాయ్ చేసిన తరువాత బెంగళూరు వచ్చానని మను అంగీకరించాడని పోలీసులు అధికారులు అన్నారు. తనను తానే కిడ్నాప్ చేసుకుని, హత్య చేసుకున్నట్లు నాటకాలు ఆడి పోలీసులకు సినిమా చూపించిన మనును పోలీసులు అరెస్టు చేశారు.

Latest Posts

Don't Miss