Latest Posts

Ramarao On Duty ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

మాస్ మహారాజా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా జూలై 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు శరత్ మండవ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నిర్మించారు. రవితేజకు జోడిగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించగా మరొక ముఖ్యమైన పాత్రలో వేణు తొట్టెంపూడి నటించాడు. ఈ సినిమా విడుదలకు ముందు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత మాత్రం ఊహించని ఫలితాన్ని అందుకుంది.

బాక్సాఫీస్ వద్ద దారుణమైన నష్టాలను కలుగజేసిన విషయం తెలిసిందే. అయితే ఓటీటీలో అప్పట్లో చాలా తొందరగానే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాను ఏడువారాల తర్వాతనే ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారు. ఇక అనుకున్నట్లే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో రవితేజ ఒక ఎమ్మార్వో ఆఫీసర్ గా కనిపించిన విషయం తెలిసిందే. చిత్తూరు బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను సస్పెన్స్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తీసుకువచ్చాడు.

సినిమా ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా సినిమాపై కొంత హైప్ క్రియేట్ చేశాయి. ఇక మొత్తానికి ఈ సినిమా జూలై 29న గ్రాండ్గా అయితే విడుదలైంది కానీ టాక్ ప్రకారం సినిమా కమర్షియల్ గా అయితే అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీ లో సెప్టెంబర్ 15వ తేదీన సందడి చేయబోతోంది. మొదట ఈ సినిమా ఓటిటి హక్కులను అమెజాన్ ప్రైమ్ అందుకున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ అయితే వచ్చింది. కానీ అందులో నిజం లేదు అని సోనీ లీవ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు అధికారిక ప్రకటన అయితే వెలువడింది. ఇక మొత్తానికి గురువారం రోజు సోనీ లీవ్ లో రామారావు ఆన్ డ్యూటీ సందడి చేయబోతోంది. మరి థియేటర్లో అంతగా సక్సెస్ కాలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం కొంత రెస్పాన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక మరోవైపు రవితేజ రావణాసుర, ధమాకా అనే విభిన్నమైన సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.

Latest Posts

Don't Miss