| Published: Thursday, September 15, 2022, 17:32 [IST]
oppo కంపెనీ భారత మార్కెట్‌కు సరికొత్త మోడల్ మొబైల్ సిరీస్‌ను పరిచయం చేసింది. Oppo F21s Pro మరియు Oppo F21s Pro 5G మొబైల్స్‌ను గురువారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ నుంచి మైక్రో లెన్స్ తో వచ్చిన తొలి హ్యాండ్సెట్ అని ఒప్పో పేర్కొంది. ఇది వస్తువుల సూక్ష్మ వివరాలను క్యాప్చర్ చేయడానకి 15x మరియు 30x మాగ్నిఫికేషన్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ రెండు మొబైల్స్ కూడా 6.43-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.
భారతదేశంలో Oppo F21s Pro 5G ధర, లభ్యత:
భారతదేశంలో Oppo F21s ప్రో 5G మొబైల్ యొక్క 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.25,999 గా నిర్ణయించింది.
భారతదేశంలో Oppo F21s ప్రో ధర, లభ్యత:
భారతదేశంలో Oppo F21s ప్రో మొబైల్ యొక్క 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.22,999 గా నిర్ణయించింది. ఈ రెండు మొబైల్స్ కూడా భారతదేశంలో ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇవి డాన్‌లైట్ గోల్డ్ మరియు స్టార్‌లైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో సెప్టెంబర్ 19 నుండి సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది.
Oppo F21s Pro 5G స్పెసిఫికేషన్లు:
Oppo F21s Pro 5G మొబైల్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.43-అంగుళాల పూర్తి-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ octa-core Qualcomm Snapdragon 695 5G SoC ప్రాసెసర్‌తో వస్తోంది. దీనికి 8GB వరకు RAM అందిస్తున్నారు. దీని డిస్ప్లే SCHOTT Xensation Up గ్లాస్ కవర్‌ను పొందుతుంది. Oppo F21s Pro 5G Android 12 ఆధారంగా ColorOS OS 12పై నడుస్తుంది.
ఇక కెమెరాల విషయానికొస్తే.. Oppo F21s Pro 5G బ్యాక్‌సైడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 64-మెగాపిక్సెల్ సెన్సార్‌తో f/1.7 ఎపర్చరు లెన్స్ తో వస్తోంది. మిగతా రెండింటిలో 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు f/2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ వైడ్- యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందు భాగంలో మరియు f/2.4 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
Oppo F21s Pro 5G మొబైల్ 33W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 159.9×73.2×7.66mm కొలతలు మరియు 181g బరువు ఉంటుంది. Oppo F21s Pro 5G మొబైల్ 128GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, GPS మరియు USB టైప్-సి పోర్ట్‌ను పొందుతుంది. ఆన్‌బోర్డ్ సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, ఇ-కంపాస్ మరియు గైరోస్కోప్ ఉన్నాయి.
Oppo F21s Pro స్పెసిఫికేషన్లు:
Oppo F21s Pro మొబైల్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.43-అంగుళాల పూర్తి-HD+ (1,080×2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. దీని డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ octa-core Qualcomm Snapdragon 680 SoC ప్రాసెసర్‌తో వస్తోంది. దీనికి 8GB వరకు RAM అందిస్తున్నారు. Oppo F21s Pro Android 12 ఆధారంగా ColorOS OS 12పై నడుస్తుంది.
ఇక కెమెరాల విషయానికొస్తే.. Oppo F21s Pro బ్యాక్‌సైడ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 64-మెగాపిక్సెల్ సెన్సార్‌తో f/1.7 ఎపర్చరు లెన్స్ తో వస్తోంది. మిగతా రెండింటిలో 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు f/3.3 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ వైడ్- యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందు భాగంలో మరియు f/2.4 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
Oppo F21s Pro మొబైల్ 33W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 159.9×73.2×7.66mm కొలతలు మరియు 181g బరువు ఉంటుంది. Oppo F21s Pro మొబైల్ 128GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజీను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1, GPS మరియు USB టైప్-సి పోర్ట్‌ను పొందుతుంది.
Best Mobiles in India
54,999
36,599
39,999
38,990
1,29,900
79,990
38,900
18,999
19,300
69,999
79,900
1,09,999
1,19,900
21,999
1,29,900
12,999
44,999
15,999
7,332
17,091
29,999
7,999
8,999
45,835
77,935
48,030
29,616
57,999
12,670
79,470
English summary
Two Mobiles Launched from Oppo F21s Pro series, new models has micro lens camera
Story first published: Thursday, September 15, 2022, 17:32 [IST]