For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Sunday, September 11, 2022, 10:26 [IST]
Multibagger Stock: ఏదైనా మల్టీబ్యాగర్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లు అద్భుతమైన రాబడిని పొందవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించాలంటే సహనంగా వాటిని కొనసాగించటం ఒక్కటే మార్గం. సహనంతో స్టాక్ మార్కెట్ నుంచి అనేక రెట్లు లాభాలు పొందవచ్చు. గత 20 ఏళ్లలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించిన ఒక షేర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
స్టాక్ వివరాలు..
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది హావెల్స్ ఇండియా కంపెనీ షేర్ గురించి. ఇది 2001 నుంచి ఇప్పటి వరకు 72,926.46 శాతం బలమైన రాబడిని అందించి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. 23 మార్చి 2001న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఈ స్టాక్ ధర అప్పట్లో రూ.1.89 మాత్రమే. హావెల్స్ ఇండియా షేర్లు NSEలో రూ.1,346 వద్ద ఉంది. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 62 శాతానికి పెరిగింది.
6 నెలల్లో అదరగొట్టిన హావెల్స్..
హావెల్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం కంపెనీ క్యాపిటలైజేషన్ విలువ రూ.86.35 వేల కోట్లుగా ఉంది. ఈ విలువతో హావెల్స్ ఇండియా ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీగా మారింది. గత నెల పనితీరు గమనిస్తే.. హావెల్స్ వాటా 5.82 శాతం పెరిగింది. గడచిన 6 నెలల్లో కంపెనీ స్టాక్ దాని ఇన్వెస్టర్లకు 28 శాతం రాబడిని ఇచ్చింది.
కంపెనీ చేసే వ్యాపారం..
హావెల్స్ 1958లో ప్రారంభించబడింది. హావెల్స్ గృహోపకరణాలు, లైటింగ్ పరికరాలు, LED లైటింగ్, ఫ్యాన్లు, మాడ్యులర్ స్విచ్‌లు, వైరింగ్ ఉపకరణాలు, వాటర్ హీటర్లతో సహా అనేక రకాల గృహ, పారిశ్రామిక ఉత్పత్తులను తయారు చేస్తోంది. మన దేశీయ మార్కెట్లో హావెల్స్ పరికరాల వినియోగం చాలా ఉంది. విదేశాల్లోనూ కంపెనీ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. కంపెనీ మార్కెట్ క్యాప్ వేగంగా పెరుగుతోంది.
రూ.15 వేలతో కోటీశ్వరులు..
లిస్టింగ్ సమయం నుంచి హావెల్స్ ఇండియా స్టాక్ ఇప్పటి వరకు తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించి వారిని కోటీశ్వరులను చేసింది. మార్చి 23, 2001న హావెల్స్ ఇండియా స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వారు ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం రూ.7.29 కోట్లు పొందేవారు. అప్పట్లో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో కేవలం రూ.15 వేలు పెట్టుబడిగా పెట్టినట్లయితే.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం అతను రూ. కోటికి పైగా రిటర్న్స్ పొందేవారు. అదే విధంగా గత ఐదేళ్లలో కంపెనీ 182 శాతం రాబడిని ఇచ్చింది.
English summary
hawells india stock turned lakh to 7.3 crores in longrun with multibagger returns
hawells india stock turned lakh to 7.3 crores in longrun with multibagger returns…
Story first published: Sunday, September 11, 2022, 10:26 [IST]