For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Thursday, September 15, 2022, 9:45 [IST]
Multibagger Stock: కరోనా తర్వాత కంపెనీలు తమ వ్యాపారాల విస్తరణను వేగవంతం చేశాయి. ఈ వార్తలతో ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను అనేక కంపెనీల్లో కొనసాగించటంతో పాటు, కొత్త పెట్టుబడులను సైతం చేస్తున్నారు. వేగవంతంగా వృద్ధి చెందుతూ.. ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కంపెనీ వివరాలు..
ఎన్ఎస్ఈలో లిస్టెడ్ మైక్రోక్యాప్ కంపెనీ.. స్టాక్ క్షితిజ్ పాలీలైన్(Kshitij Polyline Ltd) స్టాక్ ధర మంగళవారం రికార్డు స్థాయికి చేరుకుంది. గత రెండు నెలల్లో దీని ఒక్కో షేరు ధర రూ.34 స్థాయి నుంచి రూ.88కి పెరిగింది. ఈ సమయంలో ఇన్వెస్టర్లకు బలమైన మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కంపెనీ ఈ-కామర్స్ డొమైన్‌లోకి ప్రవేశించబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అప్పటి నుంచి షేర్లు విజృంభించాయి.
కంపెనీ ప్లాన్ ఏమిటి?
మైక్రోక్యాప్ కంపెనీ ఈ-కామర్స్ డొమైన్‌లోకి ప్రవేశించడానికి, దాని ఉత్పత్తి శ్రేణిని విస్తృతం చేయడానికి వివిధ ఉత్పత్తులను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది. ఈ సమాచారంతో మల్టీబ్యాగర్ స్టాక్ మంగళవారం నాటి సెషన్లో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో స్టాక్ కొత్త జీవిత కాల గరిష్ఠ స్థాయి అయిన రూ.87.40కి చేరుకుంది. ప్రస్తుతం క్షితిజ్ పాలీలైన్ మార్కెట్ క్యాప్ రూ.89 కోట్లకు చేరుకుంది.
బోర్డు నిర్ణయం వివరాలు..
క్షితిజ్ పాలీలైన్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా 12 సెప్టెంబర్ 2022న ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. కంపెనీ అదాయాన్ని పెంచేందుకు, వృద్ధిని సాధించటానికి తాము ఈ- కామర్స్ రంగంలోనికి ప్రవేశించడాన్ని బోర్డు పరిగణించిందని అందులో వెల్లడించింది. దీనికి బోర్డు పూర్తి ఆమోదం తెలిపినట్లు స్పష్టం చేసింది.
కొత్త వ్యాపారం..
కంపెనీ తన సొంత వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి దాని ద్వారా.. ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయించడం, వేగవంతమైన డెలివరీ కోసం స్టోర్లను తెరవడం, కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆఫ్‌లైన్ & ఆన్లైన్ మార్కెటింగ్‌తో పాటు ఇతర విక్రేతలతో టై అప్ కావాలని భావిస్తోంది. ఇలా సాధ్యమయ్యే అన్ని ఆదాయాలను మెరుగుపరచడానికి కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. అలా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేయాలని డామన్ & డయ్యూ ఆధారిత సంస్థ నిర్ణయించుకుంది.
బలమైన వృద్ధి..
గత ఆరు నెలల్లో క్షితిజ్ పాలిలైన్ షేర్లు 170 శాతం దూసుకెళ్లాయి. స్టాక్ కేవలం ఒక నెలలో భారీగా 62 శాతం లాభపడింది. మంగళవారం 30,768 ట్రేడ్ వాల్యూమ్‌తో ముగిశాయి. షేర్ 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.32.35 వద్ద ఉండగా.. దాని 52 వారాల గరిష్ఠ ధర రూ.96.30గా ఉంది. 1998లో స్థాపించబడిన కంపెనీ.. స్మార్ట్ ID కార్డ్ ఉత్పత్తులు, బైండింగ్ & లామినేషన్ పరికరాలు, సంబంధిత మెటీరియల్‌లు, స్టేషనరీ ఉత్పత్తులతో పాటు ఉపకరణాలను తయారు చేయడం, పంపిణీ చేయడం, సరఫరా చేయడం, దిగుమతి, ఎగుమతి చేసే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
English summary
multibagger stock Kshitij Polyline Ltd price skyrocking after announcement on entering e-commerce business
multibagger stock Kshitij Polyline Ltd price skyrocking after announcement on entering e-commerce business
Story first published: Thursday, September 15, 2022, 9:45 [IST]