Latest Posts

Janaki Kalaganaledu September 15th: అఖిల్ మాటలకు జెస్సి షాకింగ్ నిర్ణయం.. జనకిలో కొత్త టెన్షన్!

జానకి కలగనలేదు మంచి కథాంశంతో ప్రేక్షకులలో మంచి ఆదరణను పెంచుకుంటోంది. భర్త రామచంద్ర సహకారంతోనే జానకి తన ఐపీఎస్ కలను పూర్తి చేయాలని అనుకున్న జానకికి అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే జనకికి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ కూడా పెరిగాయి. గత వారం నుంచి 7.90 రేటింగ్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 389 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం పదండి..

జానకి మరిది అఖిల్ జెస్సితో ప్రేమలో పడి ఆమెకి గర్భం వచ్చేలా చేస్తాడు. ఇక ఆ తరువాత జెస్సి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాలని అఖిల్ పై ఒత్తిడి పెంచుతుంది. అయితే అఖిల్ మాత్రం తన తల్లి జ్ఞానాంబకు భయపడి ఇంట్లో ఆ విషయాన్ని చెప్పడానికి వెనుకడుగు వేస్తాడు. ఇక లాభం లేదనుకొని జెస్సి జానకికి అసలు విషయం చెబుతుంది. దీంతో జానకి అఖిల్ ని ఒప్పించాలని వారిద్దరికీ పెళ్లి చేయాలని కూడా అనుకుంటుంది. కానీ అఖిల్ మాత్రం మాట మారుస్తూ నాకు జెస్సికి ఎలాంటి సంబంధం లేదు అని తను ఎవరితోనో కడుపు చేయించుకుని మోసం చేయాలని అనుకుంటుంది అని అంటాడు. ఇక చివరికి తల్లి మీద కూడా ఓటు వేయడంతో అఖిల్ నమ్ముతుంది. మరోవైపు జానకి పై కూడా జ్ఞానాంబ అనుమం వ్యక్తం చేస్తుంది. నువ్వు ఎవరి మాటలు నమ్ముతున్నావు.. అని వాటన్నిటిని వదిలేసి ముందు నీ చదువుపై దృష్టి పెట్టాలి అని హెచ్చరిస్తుంది.

అయితే ఈ విషయంలో జానకి పై మరింత కోపం తెప్పించాలి అని మల్లికా తన అత్త జ్ఞానాంబ లేనిపోని అబద్ధాలు కూడా చెప్పాలని పక్కింటి లీలావతిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తుంది. బయట జనాలు అందరూ కూడా జస్సీ అనే అమ్మాయికి మీ వల్ల ఏదో జరిగిందని అనుకుంటున్నారని లీలావతి జ్ఞానాంబతో మాట్లాడుతుంది. అయితే అందుకు జ్ఞానాంబ మాత్రం కోప్పడుతుంది. మరోసారి మా ఇంటి విషయాలు నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అంటూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అని అంటుంది. ఇక లీలవతి నోరు మూయించినంత మాత్రాన ఊర్లో వాళ్ళ నోళ్లు మూయిస్తారా అంటూ పక్కనే ఉన్న మల్లికా మరింత చిచ్చు రాజేసే ప్రయత్నం చేస్తుంది.

మరోవైపు జానకి పరీక్షలు ఉన్నప్పటికీ కూడా తన మనసు ఏమి బాగోలేదు అంటూ కాలేజీకి కూడా వెళ్ళనని అంటుంది. రామచంద్ర మాత్రం ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను అని మీరు ముందు మీ చదువుపై దృష్టి పెట్టాలి అని కూడా బ్రతిమాలతూ ఉంటాడు. ఇక అప్పుడే వీరు మాట్లాడకుంటున్న మాటలను విన్న జ్ఞానాంబ కూడా కొంత సీరియస్ అవుతుంది. నువ్వు చదువుకోడానికి ముందు నేను ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు నువ్వు చదువుకునేందుకు ఒప్పుకున్నాను. అంతే కాకుండా ఇంటి బాధ్యతలను కూడా నీకు అప్పగించాను. కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా ఎవరో అమ్మాయి సమస్యను తెచ్చి పెట్టుకున్నావు. నీ లక్ష్యాన్ని గురించి మర్చిపోయి దాని గురించి ఆలోచిస్తున్నావు అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని అంటుంది.

పక్కనే ఉన్న మల్లిక కూడా నువ్వు అనవసరంగా ఎవరో అమ్మాయి అబద్ధాలు చెబితే అత్తగారిని బాధ పెడుతున్నావు అని అంటుంది. కానీ అందుకు జానకి ఇది ఒక అమ్మాయి సమస్య కాదు అని మన ఇంటి పరువు సమస్య అని.. రేపు ఏదైనా జరిగితే ఇంట్లో అందరం బాధపడాల్సి వస్తుంది అని అంటుంది. దీంతో జ్ఞానాంబ మరింత ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ నీకు ఎంత చెప్పినా కూడా వినడం లేదు అని ఆ తలను రామచంద్ర కూడా ఎక్కించావు అని అంటుంది. ఇక నువ్వు కాలేజీకి తొందరగా వెళ్ళాలి అని అవసరమైతే నేను తీసుకువెళ్తాను అని అంటుంది. దీంతో రామచంద్ర అవసరం లేదమ్మా అంటూ నేను జానకిని కాలేజ్ దగ్గర దింపి వస్తాను అని అంటాడు. ఆ తర్వాత రామచంద్ర తో జానకి కాలేజీకి వెళుతుంది.

ఇక ఇంట్లో జెస్సీ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. వదిన ఈ విషయాన్ని వదిలిపెట్టేలా లేదు అని దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అని అనుకుంటాడు. అయితే తండ్రి గోవిందరాజులు మాత్రం అఖిల్ ను అనుమానిస్తాడు. నీలో ఒక భయం కనిపిస్తుంది అని అవసరమైతే నాతో నిజం చెప్పాలి అని.. నేను మీ అమ్మతో మాట్లాడుతాను అని అంటాడు. కానీ అప్పుడు పక్క నుంచి జ్ఞానాంబ రావడంతో అఖిల్ మాట మారుస్తాడు. నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావా నాన్న అంటూ.. దీనంగా మాట్లాడుతాడు. ఇక జ్ఞానాంబ అఖిల్ను వెళ్లి చదువుకోవాలి అని చెబుతుంది. జానకి నిజం ఉంటే తప్ప ఎవరిని అనుమానించదు అని ఈ విషయంలో తనవైపు నుంచి కూడా ఆలోచించాలి అని గోవిందరాజులు అంటాడు. అయినప్పటికీ జ్ఞానాంబ నిజం నిరూపించే వరకు ఎదురు చూద్దామని అంటాడు.

అఖిల్ ఆ టెన్షన్ తట్టుకోలేక పర్మినెంట్ సొల్యూషన్ ఆలోచించాలి అని జెస్సి కి ఫోన్ చేస్తాడు. నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకోవాలి అని లేకపోతే జీవితంతో మన పెళ్లి జరగదు అని.. ఇలానే మొండిగా ప్రవర్తిస్తే మర్చిపోతాను అని కూడా అంటాడు. దీంతో జెస్సి తన తల్లిదండ్రులకు బాధ పెట్టలేక తను ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటుంది. ఇక తర్వాత జెస్సీ తల్లిదండ్రులు వెంటనే జానకికి ఫోన్ చేస్తారు. అప్పుడే పరీక్షా హాల్ లోకి వెళ్లాలని అనుకుంటున్న జానకి జెస్సి తల్లిదండ్రులు చెప్పిన మాటలకు షాక్ అవుతుంది. మరి వాళ్ళు ఏమి చెప్పారు అనేది తెలియాలి అంటే తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

Latest Posts

Don't Miss