Latest Posts

Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు షాకిచ్చిన సామ్రాట్.. నందూ కోసం తులసి ఊహించని నిర్ణయం

జనరేషన్ అప్‌డేట్ అవుతూ ఉన్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘ఇంటింటి గృహలక్ష్మి’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటింటి గృహలక్ష్మి’ గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గణపతి పూజ కోసం ఇంటికి వచ్చిన అతిథులతో కలిసి తులసి కుటుంబ సభ్యులు చీటీల ఆట ఆడతారు. అందులో ముందుగా ప్రేమ్, శృతి నిజంగానే గొడవ పెట్టుకుని టాస్కు కోసం నటించామని అబద్దం చెప్తారు. ఆ తర్వాత నందూ, లాస్య ఓ పాటకు డ్యాన్స్ చేస్తారు. అంతేకాదు, ఆమెను పైకి లేపి తిప్పుతాడు. అనంతరం తులసి ఓ పాట పాడుతుంది. ఇక, చివర్లో సామ్రాట్ మాత్రం నందూ, తులసి మధ్య జరిగిన ఒప్పందాన్ని కథలా చెప్తాడు. దీంతో నందూ, లాస్య కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత సామ్రాట్ కూడా వెళ్లిపోతాడు.

చీటీల ఆటలో సామ్రాట్ నిజం చెప్పేసరికి నందూ, లాస్య కోపంగా ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత తులసిపై లాస్య నందూకు లేనిపోనివి చెబుతుంది. ‘తులసి ఎంత పని చేసిందో చూశావా నందూ.. ఆ విషయాన్ని సామ్రాట్ చెవిలో ఊదింది. అందుకే ఆయన అలా మాట్లాడారు. లేకపోతే ఈ విషయం సామ్రాట్‌కు ఎలా తెలుస్తుంది చెప్పు. ఇదంతా తన పనే’ అని నిందలు వేస్తుంది. దీంతో నందూ ‘తులసే ఆ విషయాన్ని సామ్రాట్‌కు చెప్పిందని నువ్వెందుకు అనుకుంటున్నావు. ఇప్పుడు సమస్య అది కాదు. సామ్రాట్‌కు అసలు విషయం తెలిసింది’ అని అంటాడు.

అంతేకాదు, ఆ తర్వాత నందూ ‘సామ్రాట్‌కు ఈ విషయం తెలిసిన తర్వాత ఇక నేను నా మొహాన్ని ఆయనకు చూపించలేను. ఇప్పుడు ఆయన నన్ను చూసే చూపులు అస్సలు తట్టుకోలేను’ అంటాడు. దీంతో లాస్య ‘నువ్వు టెన్షన్ పడకు. మన ఉద్యోగాలు ఎటూ పోకుండా ఉండేలా చేసే బాధ్యత నాది. ఆ ఉద్యోగాలు పోతే మన జీవితాలు పోయినట్టే. నేను వెళ్లి సామ్రాట్‌తో మాట్లాడుతా. సామ్రాట్ ఎమోషన్‌ను అడ్డం పెట్టుకొని నేను ఆయనతో మాట్లాడుతా’ అని నందూను కన్విన్స్ చేస్తుంది. దీంతో అప్పటి వరకూ టెన్షన్ పడిన నందూ కాస్త ఆలోచనలో పడిపోతాడు.

తులసికి సారీ చెప్పి ఆఫీసుకు రమ్మన్న సామ్రాట్.. ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ల బాబాయి తులసికి నువ్వు దూరంగా ఉండాలన్నా హనీ ఉండనివ్వదురా అంటాడు. తర్వాత తన రూమ్ బయటికి వచ్చి చూడగా తులసి కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఆమెకు అక్కడ చూసి సామ్రాట్ సంతోషిస్తాడు. తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి ఎప్పుడు వచ్చారు అని అడుగుతాడు. దీనికామె ఇంతకుముందే వచ్చాను అంటుంది. అప్పుడు సామ్రాట్ మరి లోపలికి రాలేదేంటని అడుగుతాడు. దీంతో మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా. అందుకే రాలేదంటుంది.

ఆ తర్వాత తులసి నేను ఇక్కడికి రాలేనేమో అని అనుకున్నారా అని సామ్రాట్‌ను అడుగుతుంది. దీనికి సామ్రాట్ ‘మీకు మైండ్ రీడింగ్ కూడా తెలుసా. మీరు కొన్ని రోజులు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దూరంగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా’ అంటాడు. అప్పుడు తులసి ‘ఒక పక్షికి స్వేచ్ఛగా ఎగరడం ఎంత ముఖ్యమో.. తన గూడు కూడా అంతే ముఖ్యం. నా వరకు నా గూడు నా ఇల్లు. నా బలం, నా ప్రపంచం నా కుటుంబం. నేను పైకి ఎగరాలని ఆశపడుతున్నారు. కానీ, నా వాల్లను వదులుకొని కాదు. ఒకవేళ నేను అలా వెళ్లినా నా శరీరం ముందుకెళ్తుంది కానీ.. నా శ్వాస అక్కడే ఉంటుంది’ అంటుంది. అప్పుడు సామ్రాట్ జరిగిందంతా మరిచిపోండి. మీ మనసు ఎలా చెబితే అలా నడుచుకోండి అంటాడు. దీంతో నా పార్టనర్ చెబితే ఓకే అంటుంది.

సామ్రాట్, తులసి మాట్లాడుతుండగా లాస్య ఆఫీస్‌కు వస్తుంది. వచ్చీ రావడమే ‘గుడ్ మార్నింగ్ సార్. మీతో మాట్లాడాలి. ఒక్క 5 నిమిషాలు చాలు. మీరు బిజీగా ఉంటారని తెలుసు. కావాలంటే తులసి గారి ముందే మాట్లాడుదాం’ అంటుంది. దీంతో తులసి నాకు అవసరం లేని విషయాల్లో నేను తలదూర్చను. నేను వెళ్తా అంటుంది. అప్పుడు సామ్రాట్ ‘ఒక అర్జెంట్ మీటింగ్‌లో ఉన్నాం. నువ్వు క్యాబిన్‌లో వెయిట్ చేయి’ అంటాడు. దీంతో లాస్య చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నందూ గురించి మాట్లాడగా.. తులసి అ విషయం వద్దని అంటుంది.

ఆ తర్వాత తులసితో సామ్రాట్ ‘జీవితాన్ని డిస్టర్బ్ చేసిన వారితో కలిసి ఒకే ఆఫీసులో పనిచేయడం చాలా కష్టం. మీ ఇబ్బంది ఏంటో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లను మళ్లీ జాబ్‌లోకి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎంత కాదనుకున్నా.. వద్దనుకున్నా పర్సనల్ గొడవలు ఆఫీసులోనూ మొదలవుతాయి. స్టాఫ్ ముందు పరువు పోతుంది. మీ ఫ్యామిలీ గొడవలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. నందూ, లాస్యను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదికే వదిలేస్తున్నా. తులసి మీ నిర్ణయం ఏంటో చెప్పండి. నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉందా’ అంటాడు. దీంతో తులసి ‘నేను ఆలోచిస్తోంది మీ గురించే. నా గురించి దిగులు లేదు. కానీ, నాకు హాని చేసిన వారికి చెడు జరగాలని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది.

తులసి మాటలతో సామ్రాట్ ‘మీ మనసులో ఏముందో నాకు అర్థం అయింది తులసి గారు. లాస్యను నేను డీల్ చేస్తాను’ అని ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు లాస్య ‘తెలియక చేసిన ఒక తప్పు వల్ల మా జాబ్స్ ప్రాబ్లమ్‌లో పడింది అనిపించింది’ అంటుంది. దీంతో అతడు ‘నువ్వు ఏ తప్పు గురించి మాట్లాడుతున్నావు.

తులసి విషయంలో మీ భర్త నంద గోపాల్ చేసిన తప్పు గురించా.. లేక మీరు తులసికి చేసిన అన్యాయం గురించా’ అంటాడు. అప్పుడు లాస్య వాటి గురించి కాదు సార్. మా జాబ్స్ మాకు చాలా ముఖ్యం’ అంటుంది. ఆ తర్వాత లాస్య దగ్గర మళ్లీ ఇలాంటి గొడవలు జరగకుండా ఉంటాయని మాట తీసుకుని సామ్రాట్ వాళ్ల జాబ్‌లకు ఓకే చెప్తాడు. అంతేకాదు, ఈ జాబ్‌లు తిరిగి ఇవ్వడానికి తులసే కారణం అని అంటాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది. అనంతరం తన విషయంలో జోక్యం చేసుకోవద్దని నందూకు చెప్పమంటూ తులసి లాస్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

Latest Posts

Don't Miss