Published: Thursday, September 15, 2022, 10:51 [IST]
భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధిపొందిన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) ఈ సంవత్సరం జులై నెలలో తన 'ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' (Xpulse 200 4V Rally Edition) ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. అయితే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం నాలుగు రోజల్లోనే అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి, కావున అప్పుడు బుకింగ్స్ స్వీకరించడం నిలిపివేసింది.
Recommended Video
భారత్‌లో విడుదలైన Hero Xpulse 4V Rally Edition | ధర & వివరాలు
అయితే కంపెనీ ఇటీవల రెండవ సారి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ కూడా తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 'ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' (Xpulse 200 4V Rally Edition) యొక్క సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి. అంటే కంపెనీ సెకండ్ బ్యాచ్ కి కేటాయించిన అన్ని యూనిట్లు విక్రయించకబడ్డాయి. అయితే సెకండ్ బ్యాచ్ లో కంపెనీ ఎన్ని యూనిట్లకు బుకింగ్స్ స్వీకరించిందనే విషయం మాత్రం వెల్లడించలేదు. బహుశా మొదటి బ్యాచ్ లో కంపెనీ ఎన్ని యూనిట్లకు బుకింగ్స్ స్వీకరించిందో, సెకండ్ బ్యాచ్ లో కూడా అన్ని యూనిట్లకు బుకింగ్స్ స్వీకరించినట్లు తెలుస్తోంది.
భారతీయ మార్కెట్లో '2022 హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మంచి కలర్ ఆప్సన్ కూడా పొందుతుంది. కావున ఇప్పుడు బ్లాక్ మరియు రెడ్ కలర్ గ్రాఫిక్స్‌తో పాటు వైట్ కలర్ బేస్ పెయింట్ పొందుతుంది, కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే స్టాండర్డ్ మోడల్ మాత్రం మాట్ నెక్సస్ బ్లూ, పోలెస్టార్ బ్లూ మరియు స్పోర్ట్స్ రెడ్ అనే మూడు పెయింట్ తీమ్స్ లో అందుబాటులో ఉంటుంది.
అయితే ఈ కొత్త మోటార్ సైకిల్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త బైక్ మునుపటి మోడల్ కంటే కూడా చాలా అప్డేట్ డిజైన్ పొందుతుంది. ఇందులో ప్రత్యేకమైన ర్యాలీ కోడ్ గ్రాఫిక్స్, ఫ్రంట్ ఫెండర్‌పై ర్యాలీ ఎడిషన్ డెకాల్ మరియు ఫ్యూయెల్ ట్యాంక్ పైన ‘సిఎస్ సంతోష్’ ఆటోగ్రాఫ్ వంటివి కూడా చూడవచ్చు.
ఈ కొత్త 2022 బైక్ దాని స్టాండర్డ్ మోడల్ లోని కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ కూడా తీసుకుంటుంది. అవి ముందుభాగంలో ఉన్న రౌండ్ హెడ్‌లైట్, పొడవైన-సెట్ ఫ్రంట్ ఫెండర్, సింగిల్-పీస్ సీటు, ఎగ్జాస్ట్ కోసం హై పొజిషన్ మరియు వెనుక భాగంలో ఒక కాంపాక్ట్ లగేజ్ రాక్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. కావున మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.
2022 హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ లో 199.6 సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, 4-స్ట్రోక్, 4-స్ట్రోక్, 4-వాల్వ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.9 బిహెచ్పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. కావున ఈ బైక్ మంచి పనితీరుని అందిస్తుంది.
2022 ‘హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్’ బైక్ యొక్క ముందు వైపున ఒక పొడవాటి మరియు పెద్ద 37 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ ఫోకస్ సస్పెన్షన్ అందుబాటులో ఉంటుంది, వెనుక వైపున మోనో-షాక్ యూనిట్ ఉంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఇప్పుడు దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువగా 270 మిమీ వరకు ఉంది. కావున మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని కూడా పొందవచ్చు.
ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ యొక్క సీటు ఎత్తు 885 మిమీ కాగా, హ్యాండిల్‌బార్ రైజర్లు 40 మిమీ కంటే ఎక్కువ పొడవు పొందాయి. ఇవి మరింత ఉత్తమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతే కాకుండా ర్యాలీ ఎడిషన్ లో పొడిగించబడిన గేర్ లివర్, పొడవాటి సైడ్ స్టాండ్ మరియు డ్యూయల్ పర్పస్ టైర్స్ కూడా ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్ యొక్క బరువు (కర్బ్) 160 కేజీలు. కావున ఇది రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదలైనప్పటినుంచి కూడా మంచి అమ్మకాలతో మున్దుకు దూసుకెళ్తోంది అనటానికి అది పొందిన బుకింగ్స్ మనకు నిదర్శనం. బుకింగ్స్ ప్రారంభమైన రెండు సార్లు కూడా అతి తక్కువ సమయంలోనే అన్ని యూనిట్లు విక్రయించబడ్డాయి. అయితే మరింతమంది కొంగోలుచేయాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ మళ్ళీ తప్పకుండా బుకింగ్స్ ప్రారంభిస్తుందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన అప్డేటెడ్ సమాచారం పొందటానికి మా తెలుగు డ్రైవ్స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.
English summary
2022 hero xpulse 200 4v rally edition second batch bookings closed details
Story first published: Thursday, September 15, 2022, 10:51 [IST]