చుండ్రు చాలా సాధారణమైన సమస్య. దేశంలో సగానికిపైగా జనం తలలో చుండ్రు సమస్యను ఎదుర్కొంటున్నారు. చుండ్రు ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్, చుండ్రు వచ్చినవారికి తలలో ఉన్న చర్మం పొరలుగా మారి తలంతా వ్యాపిస్తుంది. దీని వల్ల తలలో దురద సమస్య వస్తుంది. ముఖ్యంగా యువకులలో ఇటీవల కాలంలో చుండ్రు సమస్య బాగా పెరిగిపోయింది. చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఇతరత్రా చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి చుండ్రుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు. ఇక ఈ చుండ్రు సమస్యకు మన ఇంట్లోనే సహజ పద్ధతుల ద్వారా నివారించుకునే మార్గాలను సూచిస్తున్నారు.
టీ ట్రీ ఆయిల్ వాడి చూడండి
టీ ట్రీ ఆయిల్ మొటిమలు మరియు సోరియాసిస్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడింది. ఇది శక్తివంతమైన యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండడంవల్ల, ఇది చుండ్రు యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది . అయితే టీ ట్రీ ఆయిల్ సున్నితమైన చర్మం ఉన్నవారిలో చికాకు కలిగించవచ్చు. అందువల్ల, మీ చర్మానికి నేరుగా అప్లై చేసే ముందు కొబ్బరి నూనె వంటి ఆయిల్‌కి కొన్ని చుక్కలను కలిపి మొదటి వాడి చూసి, ఆ తర్వాత దాని ప్రభావాన్ని బట్టి వాడుకోవాలని సూచించబడింది.
కొబ్బరి నూనె రెగ్యులర్ గా అప్లై చెయ్యండి
బహుళ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన కొబ్బరి నూనెను చుండ్రుకు సహజ నివారణగా కూడా ఉపయోగిస్తారు. ఇది స్కిన్ హైడ్రేషన్‌ని మెరుగుపరచడం మరియు పొడిబారకుండా నిరోధించడం చేస్తుంది. కొబ్బరి నూనె ఇతరత్రా చర్మ వ్యాధులకు కూడా బాగా ఉపయోగపడుతుందని సూచించబడింది. కాబట్టి కొబ్బరినూనె ఉపయోగించి చుండ్రు సమస్య నుంచి బయట పడాలని సలహా ఇస్తున్నారు
కలబందను వాడి చూడండి
కలబంద చుండ్రును నివారించడంలో చాలా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. కలబంద అనేది తరచుగా చర్మ సమస్యలకు , సౌందర్య సాధనాలు మరియు లోషన్లకు ఉపయోగిస్తారు. దీనిని చర్మానికి వినియోగించినప్పుడు కాలిన గాయాలు, సోరియాసిస్ వంటి అనేక లక్షణాలు తగ్గినట్లు గుర్తించారు. కలబందలోని యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు నుండి కూడా రక్షించవచ్చు.
మెంతులు, వేపాకులు బాగా ఫలితాన్ని ఇస్తాయి
ఇక జుట్టు చుండ్రు సమస్యను తగ్గించటానికి మెంతులు బాగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. అలాగే వేప ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయని చెప్తున్నారు. మెంతులు, పెరుగులో నానబెట్టి దానిని గ్రయిండ్ చేసి తలకు పట్టించి ఒక అరగంట తర్వాత తల స్నానం చేస్తే కాస్త చుండ్రు నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే వేప ఆకుల రసాన్ని కూడా తలకు పట్టించటం వల్ల చుండ్రు నుండి ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు.
ఒత్తిడి స్థాయిలను తగ్గించండి
ఒత్తిడి వల్ల కూడా తలలో చుండ్రు సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఒత్తిడిని తగ్గించుకోవాలి అని సూచిస్తున్నారు. తలపై చుండ్రు సమస్యకు, జుట్టు రాలిపోయే సమస్యకు మానసిక ఒత్తిడి కారణంగా మారుతుందని చెబుతున్నారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకుంటే చుండ్రు సమస్యను కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒత్తిడి స్వయంగా చుండ్రుకు కారణం కానప్పటికీ, ఇది తలలో పొడిచర్మం మరియు దురద వంటి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు. అందుకే ఒత్తిడి తగ్గించుకుంటే చుండ్రు కూడా తగ్గుతుందని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.