Latest Posts

Dr. BR Ambedkar: రాష్ట్ర సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. తెలంగాణ సర్కార్ నిర్ణయం..

నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును పెట్టాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. తెలంగాణ రాష్ట్ర కేంద్ర పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా. బీఆర్ .అంబేడ్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్ అన్నారు.

భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేడ్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతుందని అన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం వల్లే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయిందని గుర్తు చేశారు.

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఫెడరల్ స్పూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభిస్తాయని అన్నారు.

కేసీఆర్ నిర్ణయాన్ని దళిత సంఘాలు స్వాగతిస్తూనే.. కేసీఆర్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలని కోరారు. అలాగే దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ కు అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరారు. ఇందుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది.

Latest Posts

Don't Miss