ఇతనో వింత దొంగ.. అతను చోరీ చేసిన పైసలు, బంగారాన్ని దాటే చోట ఎక్కడో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. దొచుకెళ్లిన సొమ్మును మొత్తం అతను శ్మశానాల్లో దాచేస్తాడు. అలా అని ఇతను మామూలు దొంగ కాదు. గజ దొంగ. అతను దాదాపు 121 చోరీలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్ అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిత్తపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య అనాథ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలోనే అతను చిన్న చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసిన సొమ్ము అతను శ్మశానంలో తీసుకెళ్లి పాతిపెట్టేవాడు. ఈ క్రమం పలు సార్లు పోలీసులకు చిక్కాడు. అతనిపై ఏలూరు జిల్లా చాట్రాయి మండల పోలీసుస్టేషన్లో డీసీ షీట్ నమోదు అయింది.
ఆగస్టు 28న చల్లపల్లి ఇస్లాంనగర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సురేంద్రను అదుపులోకి తీసుకుని విచారించడం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతనుగతనెల 17న జైలు నుంచి విడుదలైన తర్వాత 20 రోజుల వ్యవధిలో చల్లపల్లితో పాటు గుడివాడ, జంగారెడ్డిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజానగరం, ఖమ్మంలో చోరీలకు పాల్పడ్డాడు.
ఈ చోరీ చేసిన సొమ్మునంత అతను శ్మశానాల్లో పాతిపెట్టాడు. దొంగిలించిన రూ.20 లక్షల విలువ చేసే బంగారు నగలు, వెండి ఆభరణాలు, బైక్, నగదును శ్మశాన వాటికల నుంచే స్వాధీనం చేసుకున్నారు.