Latest Posts

Brahmastra మూవీని ఎందుకు రిజెక్ట్ చేశానంటే.. కారణం చెప్పిన సుధీర్ బాబు

మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ సంయుక్తంగా బీ మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ బాబు, కృతిశెట్టి, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, కునాల్ కౌశిక్, సతీష్ సారపల్లి నటించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ సంగీతం, పీజీ విందా సినిమాటోగ్రఫి, మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సుధీర్ బాబు మీడియాతో మాట్లాడుతూ..

బాలీవుడ్ సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. కానీ చేయడానికి వీలు కాకపోవడంతో నేను ఒప్పుకోవడం లేదు. బ్రహ్మస్త్ర సినిమా ఆఫర్ కూడా వచ్చింది. ఆ సినిమాలో మంచి పాత్ర. అయితే అదే సమయంలో సమ్మోహనం నా ముందుకు వచ్చింది. ఆ టైమ్‌లో నేను సమ్మోహనం సినిమాను ఒప్పుకొన్నాను. అయితే బ్రహ్మస్త్ర సినిమా ముందుగా అనుకొన్నప్పుడు 2019 లేదా 2020లో రిలీజ్ చేద్దామని అనుకొన్నారు. కానీ పరిస్థితుల కారణంగా ఆ సినిమా 2022 వరకు వాయిదా పడింది.

బ్రహ్మస్త్ర సినిమాను ఒప్పుకోకపోవడానికి కారణం అదే సమయంలో పుల్లెల గోపిచంద్ బయోపిక్ అనుకొన్నాం. ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతుండటం కారణంగా బ్రహ్మస్త్రను వదులుకొన్నాను. బాలీవుడ్ కంటే.. ఇక్కడే మంచి కథలు వస్తున్నాయి. అందుకే అటువైపు వెళ్లడం లేదు అని సుధీర్ బాబు చెప్పారు.

సాధారణంగా ఒక్క సినిమా చేస్తూనే ఉంటాను. కానీ కథలు నచ్చడంతో నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాను. భవ్య క్రియేషన్స్‌లో హంట్ చేశాను. సునీల్ నారాయణ నిర్మిస్తున్న మామ మశ్చీంద్ర, యూవీ క్రియేషన్‌లో ఒక సినిమా, షెహారీ సినిమా డైరెక్టర్‌తో ఒక సినిమా ఉంది. ఈ సంవత్సరంలో మరో రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అని సుధీర్ బాబు అన్నారు.

Latest Posts

Don't Miss