Latest Posts

Bigg Boss Telugu 6: షోలో గీతూ ఊహించని పని.. అందరి ముందే బట్టలు విప్పేసి మరీ!

వేరే భాషల్లో ఎప్పుడో మొదలైనా.. ఆరేళ్ల క్రితమే తెలుగులోకి పరిచయం అయింది బిగ్ బాస్ షో. అంచనాలను పక్కన పెడితే ఎన్నో అనుమానాలతో మన భాషలోకి వచ్చిన దీనికి చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులు మద్దతును అందించారు. దీంతో ఇది తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ షోగా మారిపోయింది. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా ఇక్కడి ప్రేక్షకులు దీనికి ఊహించని రీతిలో స్పందన అందించారు. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌కు సైతం భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక, ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో గీతూ రాయల్ ఊహించని పనులు చేసి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా సూపర్ సక్సెస్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఆరో సీజన్ కూడా ఎంతో ప్రయోగాలతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఇది మొదలై రెండో వారమే అయినా.. అప్పుడే ఇందులో ఎన్నో కొత్త అంశాలను చూపించారు. అలాగే, గతంలో కంటే వైవిధ్యంగా నడుపుతున్నారు. దీంతో ఆరో సీజన్ జనరంజకంగా సాగుతూ ముందుకు దూసుకుపోతోంది.

శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఎక్కువగా అమ్మాయిలకే ప్రాధాన్యత ఇచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు చాలా మందే ఎంట్రీ ఇచ్చారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ గీతూ రాయల్ ఒకరు. యూట్యూబ్ వీడియోల ద్వారా ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఎన్నో అంచనాలతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి హైలైట్ అయిపోయింది.

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గీతూ రాయల్ ఆరంభం నుంచే దూకుడుగా గేమ్ ఆడుతోంది. గతంలో షోపై రివ్యూలు చెప్పిన ఈ భామ.. ఎలాంటి ఆట ఆడాలో అలాగే ఆడుతూ ముందుకు వెళ్తోంది. షోలో తన తల్లి తండ్రి ఉన్నా వాళ్లను ఓడిస్తానని చెప్పిన గీతూ.. అందుకు అనుగుణంగానే తనదైన తెలివితేటలతో ఆడుతోంది. దీంతో అందరికీ టార్గెట్ అవుతోంది.

బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!

ఆరో సీజన్‌లో రెండో వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు కంటెస్టెంట్లకు ‘సిసింద్రీ’ అనే టాస్కును ఇచ్చారు. ఇందులో అందరూ బొమ్మలను దాచుకుంటూ చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ వచ్చారు. కానీ, గీతూ రాయల్ మాత్రం ఆరంభంలోనే చాలా మంది బొమ్మలను దొంగతనం చేసింది. తద్వారా స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ అయ్యేలా చేసింది.

‘సిసింద్రీ’ టాస్కులో భాగంగా ప్రతి కంటెస్టెంట్ తమ బొమ్మలను దాచుకోవాల్సి ఉంటుంది. దీంతో గీతూ రాయల్ రాత్రి పూట కూడా పడుకోకుండా టాస్కును ఆడింది. ఇందులో భాగంగానే కొందరు కంటెస్టెంట్లు పడుకున్న తర్వాత వాళ్ల బొమ్మలను తీసుకెళ్లి ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఏరియాలో వేసేసింది. ఇలా శ్రీ సత్య, శ్రీహాన్ వంటి వాళ్లు ఆమె వల్ల బలైపోయారని చెప్పుకోవచ్చు.

బట్టలు విప్పేసి బాలయ్య హీరోయిన్ దారుణం: ఇలా హద్దు దాటేసిందేంటి!

కెప్టెన్సీ పోటీదారుల కోసం జరిగిన ‘సిసింద్రీ’ టాస్కులో గీతూ రాయల్ అందరి బొమ్మలను దొంగతనం చేయాలని అనుకుంది. అలాగే, తన బొమ్మను స్టోర్ రూమ్‌లో ఫ్రిడ్జ్ వెనక దాచింది. అలాంటి సమయంలో ఆమె బాత్రూంలోకి వెళ్లగానే రేవంత్ ఆ బొమ్మను దొంగిలించి.. లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో వేసేశాడు. కానీ, అప్పటికే గీతూ బాలాదిత్య బొమ్మను కూడా దాచుకుంది.

తన బొమ్మను రేవంత్ దొంగిలించడంతో.. బాలాదిత్య బొమ్మ కూడా తనదే అన్నట్లు చెప్పడానికి గీతూ రాయల్ అదిరిపోయే ప్లాన్ వేసింది. ఇందుకోసం తన బొమ్మ బట్టలను విప్పేసి.. అందరి ముందే బాలాదిత్య బొమ్మకు మార్చేసింది. కానీ, దీనిపై కంటెస్టెంట్లు అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేం లేక ఆ బొమ్మను బాలాదిత్యకు ఇచ్చి టాస్కు నుంచి తప్పుకుంది.

Latest Posts

Don't Miss