Latest Posts

Bigg Boss Telugu 6: ఫైమాకు డబుల్ షాక్.. పెద్ద పొరపాటుతో ఎలిమినేట్.. వెక్కి వెక్కి ఏడుస్తూ బయటకు!

తెలుగు టెలివిజన్ హిస్టరీలో కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా ఘనతను అందుకుంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టు, సరికొత్త టాస్కులు, గొడవలు, ఫైటింగులు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన యాంగిల్స్‌ను చూపిస్తూ ఇది సూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అందుకే సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే నిర్వహకులు ఆరో సీజన్‌ను మొదలు పెట్టారు. ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఫేమస్ కంటెస్టెంట్ ఫైమాకు రెండు షాక్‌లు తగిలాయి. అసలేం జరిగింది? దీనికి సంబంధించి వివరాలు మీకోసం!

బిగ్ బాస్ షో తెలుగులో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆరో సీజన్‌పై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని నిర్వహకులు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా నడిపిస్తున్నారు. ఇందుకోసం సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో దీనికీ ఆదరణ దక్కుతోంది.

బిందు మాధవి ఎద అందాల అరాచకం: పైన ఏమీ లేకపోవడంతో!

బిగ్ బాస్ ఆరో సీజన్ రెండో వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు ‘సిసింద్రీ’ అనే టాస్కును ఇచ్చారు. ఇందులో అందరూ బొమ్మలు పట్టుకుని ఉండాలి. ఆ బొమ్మలకు బిగ్ బాస్ చెప్పిన వాళ్లు సపర్యలు చేయాలి. ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి ట్రాలిలో వేయాలి. అలా వేసిన వాళ్లకు టాస్కులు ఉంటుంది. అలా పోటీదారులను ఎంపిక చేశారు.

మొదటి రోజు జరిగిన ‘సిసింద్రీ’ టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో చలాకీ చంటి విజయం సాధించి తొలి కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచాడు. ఇక, బుధవారం పలు రౌండ్లను జరిపించి ఇందులో మరో ముగ్గురు పోటీదారులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అయితే, మంగళవారం రాత్రి కూడా ఈ టాస్కు కొనసాగింది. పలువురు కంటెస్టెంట్లు బొమ్మలను దొంగతనం చేశారు.

బట్టలు విప్పేసి బాలయ్య హీరోయిన్ దారుణం: ఇలా హద్దు దాటేసిందేంటి!

బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో ‘సిసింద్రీ’ టాస్కుకు సంబంధించిన రెండో రౌండ్‌ను నిర్వహించారు. దీనికి ‘రింగులో కింగు’ అనే పేరు పెట్టారు. దీనికి సంచాలకుడిగా ఉన్న రేవంత్.. తనకు ఇష్టం వచ్చిన వాళ్లను ఆడించాలి. ఇందులో ఫైమా, కీర్తి, అరోహీ, ఇనాయా, అర్జున్ కల్యాణ్ ఒక సర్కిల్‌లో ఉండి.. ఒకరినొకరు బయటకు తోసేయాలి. అలా మిగిలిన వాళ్లు ఈ రౌండ్ గెలుస్తారు.

‘రింగులో కింగు’ టాస్కులో నలుగురు లేడీస్‌తో అర్జున్ పోరాటం చేశాడు. అయితే, వాళ్లంతా ఒక్కటై అతడిని ఔట్ చేశారు. ఆ తర్వాత నలుగురు లేడీ కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. అందులో ఫైమా చేతులతో నెట్టే ప్రయత్నం చేసింది. దీంతో సంచాలకుడిగా ఉన్న రేవంత్ ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినా అదే తప్పు చేయడంతో టాస్క్ నుంచి ఎలిమినేట్ చేశాడు.

శృతి మించిన నందినీ హాట్ షో: టాప్ అందాలను ఆరబోస్తూ రచ్చ

‘రింగులో కింగు’ టాస్కులో స్వీయ తప్పిదంతో ఓటమి పాలైన ఫైమా.. నిరాశగా బయటకు వచ్చేసింది. అయితే, ఆ సమయంలోనే ఆమె బొమ్మను ఒక కంటెస్టెంట్ తీసుకెళ్లి ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ ఏరియాలో పెట్టేశారు. దీంతో ఫైమా ఏకంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నుంచే బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ఏకకాలంలో ఆమెకు రెండు షాక్‌లు తగిలినట్లు అయింది.

ఒకే సమయంలో రెండో రౌండ్‌లో ఓడిపోవడంతో పాటు ఏకంగా టాస్కు నుంచే ఎలిమినేట్ అవడంతో ఫైమా తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా సేపు బాధ పడింది. అప్పుడు పలువురు కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఫైమా.. నిన్నటి ఎపిసోడ్ మొత్తం దిగాలుగాన కనిపించింది.

Latest Posts

Don't Miss