మన దేశంలో 1947 సంవత్సరం తర్వాత, ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. స్వాతంత్య్ర పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు వెనుకంజ వేయని అమరవీరులకు భారతీయ ప్రజలు తలవంచి నమస్కరించే సందర్భమది.
ఈ సమయాన్ని కనులారా చూసేందుకు ఉత్తమమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నట్లయితే, మీరు ఈ కథనాన్ని తప్పక చదవాలి. ఎందుకంటే ఈ కథనంలో భారతదేశంలో ఆగస్టు 15న జరుపుకునే ఉత్తమ ప్రదేశాల గురించి మీకు చెప్పబోతున్నాం. మరెందుకు ఆలస్యం.. అమరవీరులకు సెల్యూట్ చేద్దాం రండి!
స్వాతంత్య్ర వేడుకలు తిలకించేందుకు మీరూ సిద్ధమయ్యారా..!
మన దేశంలో 1947 సంవత్సరం తర్వాత, ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. స్వాతంత్య్ర పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు వెనుకంజ వేయని అమరవీరులకు భారతీయ ప్రజలు తలవంచి నమస్కరించే సందర్భమది. ఈ సమయాన్ని కనులారా చూసేందుకు ఉత్తమమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నట్లయితే, మీరు ఈ కథనాన్ని తప్పక చదవాలి. ఎందుకంటే ఈ కథనంలో భారతదేశంలో ఆగస్టు 15న జరుపుకునే ఉత్తమ ప్రదేశాల గురించి మీకు చెప్పబోతున్నాం. మరెందుకు ఆలస్యం.. అమరవీరులకు సెల్యూట్ చేద్దాం రండి!
కార్గిల్ వార్ మెమోరియల్..
మీరు కార్గిల్ యుద్ధంలో వీరోచిత పోరాటం సాగించిన సైనికుల స్మారక చిహ్నాలను చూడాలనుకుంటే, ఖచ్చితంగా ఈసారి కార్గిల్ వార్ మెమోరియల్ అంటే లడఖ్‌కు చేరుకోవాలి. మీరు ఒకసారి సందర్శిస్తే, భారతీయుడిగా ఉన్నందుకు వెయ్యి రెట్లకుపైగా గర్వంగా భావించే ప్రదేశం ఇది. వెయ్యి అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ స్మారక చిహ్నం లోపల ఉన్న ఒక ఇసుకరాయిపై వీర సైనికుల పేర్లు రాయబడ్డాయి. ఆగస్ట్ 15న ఇక్కడకు వేల సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు. కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ ప్రాంతమిది.
ఎర్రకోట ఢిల్లీ
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశ తొలి ప్రధాని కూడా ఎర్రకోటపై నుంచి ప్రసంగించారు. ఢిల్లీలో ఉన్న ఈ చారిత్రాత్మక కోట ప్రతి సంవత్సరం అనేక కథలకు సాక్ష్యమిస్తుంది. ఒకవేళ, మీరు ఆగస్టు 15 న ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేస్తే, ఇక్కడకు కుటుంబసమేతంగా వెళ్లవచ్చు. ఇది కాకుండా, మీరు ఢిల్లీలోని ఇండియా గేట్, రాజ్ ఘాట్-గాంధీ స్మృతి వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. మరీ ముఖ్యంగా ఇండియా గేట్, రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాలు ఆగస్టు 15 నాటికి అందంగా, ఫ్లెడ్ లైట్ల మెరుగులతో మిరిమెట్లుగొలిపేలా ముస్తాబవుతాయి. ఆనాటి స్వాంత్య్రయోధులను గుర్తు చేసేలా స్మారక చిహ్నాలను వీక్షించవచ్చు.
జలియన్ వాలా బాగ్ పంజాబ్
స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొనేందుకు పంజాబ్‌లోని అమృత్సర్ నగరానికి మించిన ప్రదేశాలు ఉండవు. అవును, ఇక్కడ మీరు జలియన్‌వాలా బాగ్ని సందర్శించవచ్చు. 1919లో వేలాది మంది అమాయకులపై కాల్పులు జరిపిన ప్రదేశం జలియన్ వాలాబాగ్. ఆ అరాచక క్షణాలకు గుర్తులుగా నిలిచే అక్కడి గోడలు తూటాల వర్షంతో నిండి ఉంటాయి. అంతేకాదు, మార్చురీవెల్గా పిలిచే బావి వేల సంఖ్యలో మృతులకు మూగ సాక్ష్యంగా కనబడుతుంది. అమృత్‌సర్‌లో, మీరు జలియన్‌వాలా బాగ్‌ను మాత్రమే కాకుండా ప్రపంచ ప్రసిద్ధ వాఘా సరిహద్దును కూడా సందర్శించవచ్చు. ఇది కాకుండా, మీరు గోల్డెన్ టెంపుల్ సందర్శించడానికి కూడా వెళ్ళవచ్చు.
మునబావో సరిహద్దు
వాఘా సరిహద్దును ఒకసారి కాదు ఎన్ని సార్లు చూసినా మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. అయితే, ఆగస్టు 15 వేడుకల సమయంలో మాత్రం ఈ సరిహద్దును తప్పక సందర్శించాలి. ఈ సరిహద్దు రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఉంది. ఇక్కడ సందర్శకులు కవాతును స్వయంగా చూడవచ్చు. ఇది కాకుండా, మీరు పాకిస్తాన్ మధ్య నడుస్తున్న రైలును కూడా చూడొచ్చు. మీరు రాజస్థాన్‌లోని లాంగేవాలా సరిహద్దును సందర్శించడానికి కూడా వెళ్లేందుకు ఈ ప్రాంతం అనువైనదిగా ఉంటుంది.