ధనుష్ హీరోగా నటించిన ‘నానే వరువేన్’ సినిమాను తెలుగులో ‘నేనే వస్తున్నా’ పేరుతో విడుదలవుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో కలైపులి ఎస్థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో కలైపులి థానుతో కలిసి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై విడుదల చేయబోతున్నారు. సెల్వరాఘవన్ – ధనుష్ కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇది. అంతేకాకుండా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని బాగా తీసినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వస్తుండటంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆసక్తిని కనపరుస్తున్నారు. ధనుష్ నటించిన ‘తిరు’ మూవీ ఇటీవలే రూ.100 కోట్ల వసూలుళ్లతో రికార్డులు సృష్టించడంతో తెలుగులో సహజంగానే దీనిపై ఆసక్తి పెరిగింది.
ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఎల్లీ అవ్రమ్ కథానాయికగా నటించింది. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. 2005లో సూర్య కథానాయకుడిగా వచ్చిన ‘గజిని’ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తొలిసారిగా ఒక డబ్బింగ్ సినిమాను అల్లు అరవింద్ విడుదల చేశారు. అది బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇన్ని సంవత్సరాల ఇన్నేళ్లకు అల్లు అరవింద్ విడుదల చేస్తుండటంతో ఆ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకు వర్కౌట్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబరు 29న తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో యోగిబాబు, ఇందుజా రవిచంద్రన్ తదితరులు నటించారు.