Latest Posts

వంద‌ల యేళ్ల చారిత్ర‌క నిర్మాణం నాగ‌న్న బావి ఎక్క‌డుందో తెలుసా?

మ‌న‌సుంటే మార్గం ఉంటుంది అంటారు. చారిత్ర‌క ప్ర‌దేశాల‌ను చూడాల‌నుకోవాలేగాని, అవి మ‌న‌కు ద‌గ్గ‌ర‌లోనే ఉంటాయి. అలాంటి నిర్మాణాల‌కు, చారిత్ర‌క నిల‌యాల‌కు తెలంగాణ ప్రాంతం పేరుపొందింది.

శతాబ్దాల కిందటి వరకు దేదీప్యమానంగా వెలిగిన ఇక్క‌డి ప్రాచీన సంపద కాలక్రమేణా శిథిలావస్థకు చేరుతుండగా.. కొన్ని మాత్రం నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. అలాంటి చారిత్ర‌క సంప‌ద‌ను మ‌న‌సును హ‌త్తుకునేలా ప‌ల‌క‌రించేందుకు మీరు సిద్ధ‌మేనా..!

     వంద‌ల యేళ్ల చారిత్ర‌క నిర్మాణం నాగ‌న్న బావి ఎక్క‌డుందో తెలుసా?

వంద‌ల యేళ్ల చారిత్ర‌క నిర్మాణం నాగ‌న్న బావి ఎక్క‌డుందో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా, లింగంపేట్ గ్రామంలో ఓ పురాత‌న క‌ట్ట‌డం ఉంది. దీనిని మెట్ల బావిగా పిలుస్తారు. సుమారు ఐదు వంద‌ల‌ ఏళ్ల నాటి ఈ పురాతన కట్టడం ప్రత్యేకమైన నిర్మాణ శైలితో నేటికీ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. ఈ బావిని కాస్త‌ పునరుద్ధరించి సరైన పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతుండగా.. ఇప్పటికే ఈ పురాతన కట్టడాన్ని చూసేందుకు సమీప ప్రాంతాల ప్రజలు నిత్యం ఇక్కడికి వ‌స్తూ ఉన్నారు. కుటుంబ స‌మేతంగా గ‌డిపేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుంది. చుట్టు గుబురుగా పెరిగిన చెట్ల మ‌ధ్య ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక్క‌డికి వ‌చ్చే సంద‌ర్శ‌కులు. ప్ర‌శాంత‌త‌కు మారుపేరు..

ప్ర‌శాంత‌త‌కు మారుపేరు..

ఎల్లారెడ్డి, లింగంపేట మధ్యనున్న వంద అడుగుల లోతున్న ఈ బావిని 18వ శతాబ్దంలో ఆ ప్రాంతానికి చెందిన లింగమ్మ దేశాయ్ నిర్మించారని చరిత్రకారులు గుర్తించారు. ఈ మెట్ల బావిని స్థానికులు 'నాగన్న బావిస‌గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే ఉద్దేశ్యంతోనే ఆమె ఈ నిర్మాణం చేపట్టగా.. ఈ గ్రామానికి ఆమె పేరే పెట్టారని స్థానికులు చెబుతున్నారు. తదనంతరం మెట్ల బావి నిర్మాణ బాధ్యతలను జక్సాని నాగన్న చూసుకోవ‌డంతో దీన్ని 'నాగన్న బావి' అని కూడా పిలుస్తారని ప్ర‌చారంలో ఉంది. చూసేందుకు ఎంతో భ‌యాన‌కంగా క‌నిపించే ఈ ప్రాంతం ప్ర‌శాంత‌త‌కు మారుపేర‌నే చెప్పాలి. అయితే ఈ బావిలో ప్రస్తుతానికి నీళ్లు లేవు. అయిన‌ప్ప‌టికీ ఇక్క‌డి నిర్మాణం చెక్కు చెద‌ర‌కుండా ఉందంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. అద్భుత నిర్మాణ శైలి..

అద్భుత నిర్మాణ శైలి..

మెట్లతో కూడిన ఈ అద్భుతమైన నిర్మాణం ఐదు అంచెలుగా రూపొందించబడింది. ఒక్కో లెవెల్ కనీసం 20 అడుగుల ఎత్తు ఉండగా బావి చుట్టూ మెట్లు నిర్మించబడ్డాయి. గుర్రాలు, ఏనుగులు సులభంగా నీరు తాగేందుకు వీలుగా బావి పడమటి వైపున ఉన్న మెట్లను మిగతా వైపుల కంటే ఎక్కువ వెడల్పుతో నిర్మించారు. అంత‌టి భారీ జీవులు సైతం వినియోగించేట‌ట్లు భావి నిర్మాణం చేశారంటే, అప్ప‌టి ఇంజనీరింగ్ ప్ర‌తిభ‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఇక ప్రతి లెవెల్‌కు రెండు వైపులా గదులు కూడా ఉన్నాయి. బావిలో స్నానం చేసి బట్టలు మార్చుకోవాలనుకునే వారికి ఆశ్రయం కల్పించేందుకు ఈ గదులను నిర్మించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రజలు సులభంగా చేరుకునేందుకు బావికి ఎనిమిది వైపులా మెట్లు నిర్మించబడ్డాయి. అయితే, ఇక్క‌డ సంద‌ర్శ‌కులు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. బావిలో నీరు లేక‌పోడం వ‌ల్ల న‌డిచేప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. వ‌ర్షాకాలం కావ‌డంతో మొత్తం పాకుప‌ట్టి ఉండ‌టం వ‌ల్ల అనుకోని ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశం ఉంది.

Latest Posts

Don't Miss