Latest Posts

రేణుకా చౌదరి పై కొడాలి నాని ఫైర్ : సినీ పెద్దలు కోరగానే నాడు – గుడివాడలో పాదయాత్ర..!!

మాజీ మంత్రి కొడాలి నాని శాసనసభా వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు..మద్దతుగా నిలిచిన వారి పైన ఫైర్ అయ్యారు. అమరావతి – కమ్మరావతి పేర్లు ఎందుకు వచ్చాయో ఆలోచించాలన్నారు. అమరావతి పైన గ్రాఫిక్స్ త ఢిల్లీ ..ముంబాయి ని మించి పోయేలా చేస్తామని అభూత కల్పన చేసారని మండిపడ్డారు. ప్రతీ రాష్ట్ర రాజధాని 30 అసెంబ్లీ నియోకవర్గాల వరకు విస్తరించి ఉందని.. అమరావతి లో కేవలం ఒక మండలం లోని 29 గ్రామాలను రాజధానిగా గ్రాఫిక్స్ తో మభ్య పెట్టారని ధ్వజమెత్తారు.

అమరావతి లో పెట్టుబడులు పెట్టిన వారు తమ స్థలాలకు కోట్లాది రూపాయాల విలువ వస్తుందనే భ్రమతో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. గోరంట్ల బుచ్చయ్య చౌదని మొదలు పలువురు టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో భూములు తీసుకున్నారని వివరించారు.

మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం వైయ‌స్ జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు.

26 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకి ఒక కలెక్టర్ ని, ఒక ఎస్పీని, కొంతమంది అధికారులను అదనంగా నియమించి, ప్రతి జిల్లానూ తక్కువ మంది ప్రజలతో, ఎక్కువ మంది అధికారులతో అభివృద్ధి చేసే అవకాశం ఉండేలా జిల్లాలను వికేంద్రీకరించి 26 జిల్లాలుగా చేసారని గుర్తు చేసారు.

సీని దర్శకులు..నిర్మాతలుగా ఉన్న అశ్వనీదత్ – రాఘవేంద్ర రావు కోరుకున్న చోట స్థలం కేటాయించారని కొడాలి నాని చెప్పారు.రేణుకా చౌదరి అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని స్పందించారు. ఖమ్మంలో కార్పోరేటర్ గా గెలవలేని ఆమె..అమరావతి గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు. రైతులు చేస్తున్న పాదయాత్ర పూర్తిగా చంద్రబాబు స్కెచ్ ప్రకారం జరుగుతోందన్నారు.

జాతీయ రహదారి మీద పాదయాత్ర చేస్తే 500 కిలో మీటర్లు నడిస్తే శ్రీకాకుళం చేరుకుంటారని..కానీ, తనతో సహా కొంత మందిని టార్గెట్ చేస్తూ పాదయాత్ర మ్యాప్ సిద్దం చేసారని చెప్పుకొచ్చారు.

తన నియోజకవర్గంలో తాను కూడా ఎప్పుడూ వెళ్లని రూట్ లో రైతుల పాదయాత్ర కొనసాగుతుందని..టీడీపీకి ఇప్పుడు తాను టార్గెట్ కావటంతో, రాజకీయంగా సుదీర్ఘంగా తన నియోజకవర్గంలో పాదయాత్రకు ప్లాన్ చేసారని వివరించారు. అదే విధంగా మిగిలిన నియోజకవర్గాల్లోనూ కొనసాగుతోందన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలోనే కర్నూలులో హైకోర్టు గురించి హామీ ఇచ్చిన విషయాన్ని నాని గుర్తు చేసారు. సీఎం జగన్ ఒక కులాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధానిని విశాఖకు తరలిస్తున్నారని ప్రచారం చేస్తున్నారని..విశాఖలోని మెజార్టీ వ్యాపారస్తులు – ప్రజా ప్రతినిధులు అదే వర్గానికి చెందిన వారని నాని వివరించారు.

జగన్ ద్వేషిస్తున్నారని చెబుతున్న సామాజిక వర్గమే ఇప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా చేస్తున్న విశాఖలో అత్యధికశాతం ఉన్నారన్నారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతోనే గ్రామ సచివాలయాలు, జిల్లాల పునర్వవ్యస్థీకరణ, రాజధానుల వికేంద్రీకరణ జరుగుతున్నాయి కానీ, వీళ్లు ఊహించినట్టు ఓ కులానికో, మతానికో, ప్రాంతానికో వ్యతిరేకంగా చేసే కార్యక్రమం కాదని వివరించారు. ఆ వర్గం ఎక్కువగా ఉండే గుంటూరు – క్రిష్ణా జిల్లాల్లో జగన్ ఓడింది రెండు జిల్లాల్లోనూ రెండు చొప్పున స్థానాల్లోనేనని చెప్పారు.

అన్ని జిల్లాల్లోనూ జగన్ ను ఆదరించారని.. అందరి వాడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందరి మంచి ఆలోచించి..భవిష్యత్ మేలు కోసమే ఈ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

Latest Posts

Don't Miss