Latest Posts

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం – పాతబస్తీలో దారుణం..!!

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం. మైనర్ బాలిక పైన సామూహిక అత్యాచరం ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలిక పైన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఓయో లాడ్జిలో రెండు రోజుల పాటు ఉంచి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మొదట బాలికను కిడ్నాప్ చేసిన యువకులు ఓయో రూమ్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చారు. అనంతరంపై బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అత్యాచారం చేసి బాలికను లాడ్జిలోనే వదిలి వెళ్లారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కొద్ది నెలల క్రితం జూబ్లీహిల్స్ లోని ఒక పబ్ నుంచి మైనర్ బాలికను తీసుకెళ్లి కారులోనే సామూహిక అత్యాచారం జరిగిన ఘటన సంచలనం రేపింది. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మైనర్ బాలిక పైన అత్యారానికి పాల్పడిన తరువాత లాడ్జిలోనే వదిలేసారు.

మత్తు నుంచి తేరుకున్న తరువాత ఆ బాలిక అక్కడ నుంచి తప్పించుకొని జరిగిన విషయాన్ని తల్లి దండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదు మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ కేసుపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Latest Posts

Don't Miss