Latest Posts

మల్కాజిగిరి బాలికపై అత్యాచారం కేసు: నిందితుడికి జీవితఖైదు

హైదరాబాద్: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మల్కాజిగిరి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2020లోని ఈ కేసుకు సంబంధించిన వివరాల్లకి వెళితే.. మల్కాజిగిరిలో నివాసముంటున్న ఓ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కాగా, తల్లిదండ్రులు విధులకు వెళ్లిన సమయంలో పెద్ద కుమార్తె(16)ను నిందితుడు లాలూ సెబాస్టియన్ ఇంట్లోకి పిలిచి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో 2020లో మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. నిందితుడు లూలూ సెబాస్టియన్‌కు జీవిత ఖైదుతోపాటు రూ. 15వేల జరిమానా విధించింది. కాగా, నిందితుడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు. సెబాస్టియన్ గతంలో ముషీరాబాద్‌లో జరిగిన ఓ హత్య కేసులోనూ నిందితుడిగా ఉండటం గమనార్హం.

రూబీ లాడ్జి ప్రమాద ఘటనలో నలుగురి అరెస్ట్

సికింద్రాబాద్ లోని రూబీ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు నిందితులు రంజిత్ సింగ్, సునీత్ సింగ్, సుదర్శన్, జస్పాల్ సింగ్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సుప్రీత్ సింగ్ పరాలో ఉన్నట్లు చెప్పారు. రంజిత్ సింగ్ పేరుతో లాడ్జి భవనం ఉంది. ఆయన కుమారులే సునీత్ సింగ్, సుప్రీత్ సింగ్ అని పోలీసులు తెలిపారు.

లాడ్జి, ఈ బైక్ వ్యాపారాలను సునీత్, సుప్రీత్ చూసుకుంటారని చెప్పారు. ఈ బైక్ కు ఛార్జింగ్ పెట్టడంతో దాని నుంచి మంటలు వెలువడినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 28 ఈ బైక్ లు, 8 బైక్‌లు, 4 ఎల్పీజీ సిలిండర్లు ఉన్నాయి. సెల్లార్ లో ఉన్న ఈ 4 సిలిండర్లను పైఅంతస్తులో ఉన్న వంటగదికి పైపుల ద్వారా అనుసంధానం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

Latest Posts

Don't Miss