Updated: Thursday, September 15, 2022, 10:10 [IST]
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని (ప్రత్యేకించి వాణిజ్య రంగంలో) మరింత సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం కొత్త ప్రణాళికలను రచిస్తోంది. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లలో ఉపయోగించే టెక్నాలజీ మాదిరిగా, జాతీయ రహదారులపై కూడా అదే తరహా (వాహనం పైభాగంలో ఎలక్ట్రిక్ వైర్లు ఉండే) టెక్నాలజీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Recommended Video
భారత్‌లో విడుదలైన Tata Nexon EV Max: పూర్తి వివరాలు
కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకారం, ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ రహదారులు ప్రయాణంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఎలక్ట్రిక్ బస్సులు మరియు ట్రక్కులను ఛార్జ్ చేయడానికి సహాయపడతాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగంగా ట్రాక్ చేస్తున్న కొన్ని దేశాలలో భారతదేశం కూడా ఒకటి.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు మరియు తయారీదారులకు సహాయపడే అనేక పథకాలు మరియు విధానాలను భారత ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడమే కాకుండా, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం పథకాలు మరియు విధివిధానాలను కూడా ప్రవేశపెట్టింది.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయబడుతోంది మరియు కొత్తగా దేశవ్యాప్తంగా అనేక చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సరికొత్త ఆలోచనలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళికలలో తాజాది మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఎలక్ట్రిక్ హైవేలను ఏర్పాటు చేయడం.
ఎలక్ట్రిక్ హైవేల కాన్సెప్ట్ కొత్తదేమీ, అభివృద్ధి చెందిన దేశాలలో గత కొంతకాలంగా ఉపయోగంలో ఉంది. ఇది రైల్వేల నుండి ప్రేరణ పొందింది, ఇక్కడ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్ల కోసం ఒక నిర్ధిష్ట ఎత్తులో ఎలక్ట్రిక్ వైర్లు అమర్చబడి ఉంటాయి. ట్రైన్ నుండి ఓ కనెక్టర్ ఈ వైర్లను తాకడం ద్వారా విద్యుత్తు ట్రైను ఇంజన్‌లోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా, ట్రైన్ ఇంజన్ పనిచేయడంతో పాటుగా దానికి కనెక్ట్ చేయబడి ఉండే ఇతర భోగీలకు కూడా విద్యుత్ సరఫరా జరుగుతుంది.
ఎలక్ట్రిక్ హైవేలు కూడా ఇదే సిద్ధాంతంపై పనిచేస్తాయి. వాణిజ్య వాహనాలు కూడా క్యాబిన్ పైభాగంలో ఉండే కనెక్టర్ సాయంతో ఎత్తులో ఉండే ఎలక్ట్రిక్ వైర్లకు కనెక్ట్ అయి, ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేయడానికి కావల్సిన స్థిరమైన విద్యుత్ సరఫరాను అందిస్తుంది. అయితే, ఇవి చక్కగా పనిచేయాలంటే, ఇందుకు కొన్ని నిర్ధిష్ట నిబంధనలు ఉంటాయి. ఇలాంటి వాహనాలను నిర్ధిష్ట లేన్‌లో మాత్రమే నడపాలి, ఆ లేన్ హహనాలను నిలపకూడదు, అలాంటి వాహనాలలో ఓవర్‌లోడ్ చేయకూడదు వంటి కండిషన్స్ చాలానే ఉంటాయి.
ఐరోపాలో ఇప్పటికే మెర్సిడెస్-బెంజ్, వోల్వో, స్కానియా మొదలైన కంపెనీలు అధిక వోల్టేజ్ ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ సాయంతో హెవీ-డ్యూటీ ఎలక్ట్రిక్ ట్రక్కులకు నడిపిస్తున్నాయి. ఈ దేశాలలో అనేక ఎలక్ట్రిక్ హైవేలు ఇప్పటికే పని చేస్తున్నాయి. ఇప్పుడు, మనదేశంలో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఐరోపాలోని ఎలక్ట్రిక్ హైవేల నుండి ప్రేరణ పొంది, ఈ తరహా హైవేలను భారత్‌లో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.
ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (IACC), రోడ్డు రవాణా మరియు జాతీయరహదారుల కోసం కేంద్ర మంత్రి, నితిన్ గడ్కరీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం సౌర మరియు పవన శక్తి ఆధారిత ఛార్జింగ్ మెకానిజమ్‌లను ప్రభుత్వం గట్టిగా ప్రోత్సహిస్తోంది. మేము వీటిని అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తున్నాము. సౌర శక్తితో నడిచే ఎలక్ట్రిక్ హైవేలు పనిచేస్తున్నప్పుడు, వాటిపై వెళ్లే భారీ ట్రక్కులు మరియు బస్సులకు ఛార్జింగ్‌ని సులభతరం చేస్తుంది” అని చెప్పారు.
అయితే, భారతదేశంలో ఈ రహదారులను ఎప్పుడు, ఎక్కడ అమలు చేయాలనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. రాబోయే నెలల్లో దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ-జైపూర్ ఎలక్ట్రిక్ హైవే ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ హైవే సరైన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హైవేతో పాటు ఆర్థిక మరియు వాణిజ్య అభివృద్ధిని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ హైవేలలో ఓవర్ హెడ్ కేబుల్స్ ఉంటాయి మరియు ఈ హై-వోల్టేజ్ కేబుల్స్ వాటి స్వంత సవాళ్లతో వస్తాయి. మరి భారత ప్రభుత్వం ఈ ఘనత ఎలా సాధిస్తుందో వేచి చూడాలి.
English summary
Electric highways in india to become reality soon nitin gadkari announces new plans