Updated: Wednesday, September 14, 2022, 14:23 [IST]
భారత మార్కెట్లో మీరు ఓ మంచి ఎమ్‌పివి కోసం వెతుకుతున్నట్లయితే, మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్న ఎక్స్ఎల్6 మీకు చాలా ఉత్తమమైన ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకో తెలుసుకోవాలంటే, ఈ కథనాన్ని పూర్తిగా చదవండి..!
Recommended Video
Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT
వాస్తవానికి, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) మారువేషంలో ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఎమ్‌పివి. ఎర్టిగాను మాస్ మార్కెట్ లక్ష్యంగా చేసుకొని విడుదల చేయగా, ఎక్స్ఎల్6ను ప్రీమియం కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని ప్రవేశపెట్టారు. ఎర్టిగా 7-సీటర్ ఆప్షన్‌తో లభిస్తుంటే, ఎక్స్ఎల్6 ఎమ్‌పివి 6-సీటర్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఎర్టిగాతో పోల్చుకుంటే, ఎక్స్ఎల్6 ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా, అధిక ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.
మారుతి సుజుకి గడచిన 2019లో తొలిసారిగా ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కంపెనీ ఇందులో మొదటిసారిగా ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్ఎల్6 ఎమ్‌పివి అయినప్పటికీ చూడటానికి ఎస్యూవీ వైఖరిని కలిగి ఉంటుంది. కారు చుట్టూ చంకీగా కనిపించే బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు మజిక్యులర్ బాడీ లైన్స్‌తో ఎక్స్ఎల్6 మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, క్రోమ్ గార్నిష్, బంపర్ దిగువ భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఆకర్షణీయమైన ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఇది చాలా అందింగా కనిపిస్తుంది.
సైడ్స్‌లో 16 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, స్ట్రక్చర్డ్ సైడ్ బాడీ ప్యానెల్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన బాడీ కలర్ సైడ్ మిర్రర్స్ మరియు క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ అవుట్ చేయబడిన బి, సి పిల్లర్స్, రూఫ్‌ని అంటిపెట్టుకుని ఉండే స్పాయిలర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని సెలెస్టియల్ బ్లూ, బ్రేవ్ ఖాకీ, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, ఓపులెంట్ రెడ్ మరియు స్ప్లెండిడ్ సిల్వర్ అనే కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.
కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఇంటీరియర్స్‌లో లభించే ఫీచర్లను గమనిస్తే, ముందు వైపు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు నావిగేషన్, స్పీడ్, ఇంజన్ ఆర్‌పిఎమ్ వంటి వివరాలను విండ్షీల్డ్పై ప్రదర్శించే కొత్త హెడ్స్-అప్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీతో పాటుగా బిల్ట్-ఇన్ సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్‌తో కూడిన కొత్త 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ డిస్ప్లే యూనిట్ 360 డిగ్రీ కెమెరా ఫీచర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.
సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్‌తో కూడిన కొత్త 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సాయంతో డ్రైవర్ అనేక ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ కార్ లాక్ అన్‌లాక్, రిమోట్ హజార్డ్ లైట్స్ ఆన్/ఆఫ్ మొదలైనవి చాలానే ఉన్నాయి. వాహన యజమానులు ఈ ఫీచర్లన్నింటినీ కూడా తమ స్మార్ట్‌ఫోన్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ‘హే సుజుకి’ అనే వేకప్ కమాండ్‌తో యాక్టివేట్ చేయదగిన వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంటుంది. స్మార్ట్ఫోన్లలోని సిరి మరియు ఓకే గూగుల్ వాయిస్ కమాండ్స్ మాదిరిగా హే సుజుకి వాయిస్ కమాండ్స్‌తో కారుకి ఆదేశాలు చేయవచ్చు.
సేఫ్టీ పరంగా చూసుకుంటే, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో ఫస్ట్-ఇన్ సెగ్మెంట్ ఫీచర్‌గా 360-డిగ్రీ కెమెరా, అన్ని వేరియంట్లలో రెండు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు (టాప్-ఎండ్ వేరియంట్లలో ఎక్కువ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్లు యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ మొదలైనవి ఉన్నాయి.
మారుతి సుజుకి గడచిన ఏప్రిల్ నెలలో తమ ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని అప్‌గ్రేడ్ చేసినప్పుడు, దాని ఇంజన్లో కూడా స్వల్ప మార్పులు చేసింది. కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగాలో ఉపయోగించిన అదే అప్డేటెడ్ 1.5 లీటర్ కె15సి పెట్రోల్ ఇంజన్‌ను ఇప్పుడు ఈ కొత్త 2022 ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కూడా ఉపయోగించారు. ఇందులోని 1.5-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్పి పవర్‌ను మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ విషయానికి వస్తే, పాత మోడళ్లలో ఉపయోగించిన 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను ఉపయోగించింది. ఇందులో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఇప్పుడు ప్యాడిల్ షిఫ్టర్లను కూడా కలిగి ఉంటుంది. ఇవి ఆటోమేటిక్ కారును నడిపే అనుభవాన్ని మరింత సరదాగా మార్చుతాయి.
చివరిగా ధరల విషయానికి వస్తే, మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ధరలు రూ. 11.29 లక్షల నుండి ప్రారంభమై రూ. 14.55 లక్షల వరకూ ఉంటాయి. అంటే, ఓ టాప్-ఎండ్ 5-సీటర్ ఎస్‌యూవీని కొనుగోలు చేసే ధరతో ఆరుగురు సౌకర్యంగా ప్రయాణించగల ఓ ఎమ్‌పివిని కొనుగోలు చేయవచ్చన్నమాట. ఒకవేళ, మీరు ఎక్కువ సీటింగ్ కెపాసిటీ మరియు తక్కువ ధర కోసం చూస్తున్నట్లుయితే, మీరు మారుతి సుజుకి ఎర్టిగాను ఎంచుకోవచ్చు. ఇది ఎక్స్ఎల్6 కన్నా తక్కువ ధరతో అదే ఇంజన్ మరియు ఇంచుమించు అవే ఫీచర్లను కలిగి ఉంటుంది.
English summary
Maruti suzuki xl6 one of the best mpvs you can buy in india here is the reason why