Latest Posts

బెంగళూరుకు అదే శాపం – హైదరాబాద్ కు వరంగా : ఇక తప్పదా..!!

దక్షిణాది సిలీకాన్ వ్యాలీ బెంగళూరు నగరం భారీ వర్షాలకు వణికిపోయింది. తిరుగులేని ఐటీ నగరంగా ఉన్న కర్ణాటక రాజధానిలో ఐటీ భవనాల్లోనూ వరద నీరు పోటెత్తింది. ప్రతిష్ఠాత్మక సంస్థలుగా పేర్కొనే ఐటీ భవనాలకు ఆక్రమించి నిర్మించినవిగా గుర్తించారు. అదే సమయంలో బెంగళూరులో వేలాది ఐటీ సంస్థలు ఉణ్నాయి. వేల కోట్ల రూపాయాల వ్యాపార లావా దేవీలు కొనసాగుతున్నాయి. లక్షలాది మంది ఉద్యోగులు బెంగళూరు కేంద్రంగా ఐటీ పరిశ్రమలో పని చేస్తున్నారు.

ఇందులో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. కానీ, ఇదే సమయంలో బెంగళూరుకు పోటీగా హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో అనూహ్య ప్రగతి సాధిస్తోంది. ఇప్పుడు బెంగళూరులో నెలకొన్ని పరిస్థితుల్లో మరోసారి హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ మరింత విస్తరణకు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెలంగాణకు చెందిన ఐటీ విభాగ ప్రముఖుల్లో సైతం ఈ చర్చ కొనసాగుతోంది. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. సిలికాన్ సిటీ బెంగళూరు సగం మునగటంతో పాటుగా..టెక్ పార్కులు వరద నీటిలో చిక్కుకున్నాయి. తాజాగా వచ్చిన వర్షాలు..మునక కారణంగా దాదాపుగా రూ 225 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా ఐటీ కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్ల ద్వారా కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. బెంగళూరులోని దొడ్డకనెళ్లిలోని విప్రో తో సహా పలే సంస్థలను అక్రమ కట్టడాలుగా గుర్తించారు. ఇటు..హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తే ఇబ్బందులు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ కూడా వర్షాల కారణంగా వరద నీటిలో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి.

కానీ, ఐటి పరిశ్రమ ప్రధానంగా ఒక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అది మెరక ప్రాంతం కావటంతో అక్కడ మాత్రం వర్షం.. వరద ప్రభావం కనిపించ లేదనే విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో ..1990 లో హైదరాబాద్ లో ప్రారంభమైన ఐటీ పరిశ్రమ..ఇప్పటి వరకు అంచెలంచలుగా విస్తరించింది. ప్రపంచంలోని మేటి ఐటీ సంస్థలు అన్నీ ప్రస్తుతం హైదరాబాద్ లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి. సైబరాబాద్..మైండ్ స్సేస్ లో అనేక ఎమ్మెన్సీ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఐటీ, ఐటీఈఎస్, కంప్యూటర్ హార్డ్ వేర్, కంప్యూటర్ హార్డ్ వేర్ కంపెనీలు నెలకొన్నాయి. దీని వెనుక రాజకీయంగా ప్రభుత్వాల నిర్ణయాల తో పాటుగా.. రవాణా సౌకర్యాలు.. వాతావరణ అనుకూల పరిస్థితులు.. హైదరాబాద్ ప్రత్యేక వాతావరణం కలిసి వచ్చాయి. తాజాగా.. అమెజాన్ క్లౌడ్ సెంటర్ కేంద్రం కూడా హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభం కానుంది.

గుగూల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, అమెజాన్ వంటి ఎంఎన్సీ సంస్థలు హైదరాబాద్ లో కొలువు తీరాయి. విస్తరంగా పెరుగుతున్న ఐటీ పెట్టుబడులు.. మానవ వనరులు…హైదరాబాద్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. బెంగళూరు తరువాత రెండో స్థానంలో దక్షిణాదిన హైదరాబాద్ నిలిచింది. అయితే, తాజాగా బెంగళూరులో కొత్తగా వెలుగులోకి వస్తున్న అంశాలు.. ఐటీ పరిశ్రమ పైన అక్కడ మారుతున్న పరిస్థితులు హైదరాబాద్ కు రానున్న రోజుల్లో ఐటీ పరిశ్రమ మరింత పెగిరేందుకు దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భారత్ లో నిజమైన హైటెక్ సిటీగా డెవలప్ అవుతున్న హైదరాబాద్ నగరం వైపు ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోంది. అయితే, అనూహ్యంగా విస్తరించిన బెంగళూరు ఐటీ పరిశ్రమతో.. హైదరాబాద్ పోటీ పడుతోందని పరిశ్రమ నిపుణులు అంగీకరిస్తున్నారు.

Latest Posts

Don't Miss