Published: Thursday, September 15, 2022, 18:18 [IST]
'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ ఛైర్మెన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనేది అందరికి తెలుసు. ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనను కదిలించే వీడియోలు లేదా తనకు నచ్చిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.
Recommended Video
Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT
ఇటీవల కూడా ఆనంద్ మహీంద్రా ఒక వీడియో చూసి అందులోని డ్రైవర్ ని ఎంతగానో అభినందించాడు. ఏకంగా ఆ డ్రైవర్ ని ప్రపంచంలోనే బెస్ట్ బొలెరో డ్రైవర్ అని ప్రశంసించాడు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.
ఇటీవల కర్ణాటకలోని కబిని రిజర్వ్ పారెస్ట్ లో ఒక అడవి ఏనుగు బొలెరో కారుని వెంబడిచిన సంఘటన గురించి చదువుకున్నాం. ఇందులో ఆ ఏనుగు ఎంతో కోపంతో బొలెరో కారుని తరుముకుంటూ వస్తోంది. అయితే ఆ సమయంలో బొలెరో డ్రైవర్ ఎంతో నేర్పుగా, ఓపికగా ఏ మాత్రం జంకకుండా చాలా దూరం మిర్రర్ లో చూసుకుంటూ కారుని వెనుకకు డ్రైవ్ చేసాడు.
మొత్తానికి ఆ బొలెరో డ్రైవర్ ఆ ఏనుగు భారీ నుంచి పర్యాటకులను కూడా కాపాడేసాడు, ఆ ఏనుగు చాలా దూరం వెంబడించిన తరువాత వెనుకకు వెళ్లిపోయింది. కారులోని పర్యాటకులు అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా ఆ బొలెరో డ్రైవర్ చేసిన ఈ సాహసానికి అందరూ ఫిదా అయిపోయారు.
ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా ఆ డ్రైవర్ సాహసానికి, నేర్పుకి ప్రపంచంలో బెస్ట్ బొలెరో డ్రైవర్ మరియు కెప్టెన్ కూల్ అంటూ అభినందిస్తూ, వీడియో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసాడు. ఈ వీడియో ఇప్పటికే 43 వేలకుపైగా లైక్స్ పొందింది. కొంతమంది ఆ డ్రైవర్ ని ప్రశంసించారు.
నిజానికి ఈ వీడియోలో బొలెరో కారుని డ్రైవ్ చేసిన డ్రైవర్ పేరు ‘ప్రకాష్’. యితడు గత 10 సంవత్సరాలుగా కర్ణాటకలోని కబిని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సఫారీ వాహనాలను డ్రైవ్ చేస్తున్నాడు. సాధారంగానే సఫారీ వాహనాలను డ్రైవ్ చేసేవారికి మంచి డ్రైవింగ్ నైపుణ్యం ఉంటుంది. ఈ నైపుణ్యం వల్లనే ఆ అడవి ఏనుగు నుంచి తప్పించుకోగలిగారు.
రిజర్వ్ ఫారెస్టులలో సఫారీ వాహనాలు తిరగటానికి రహదారి ఉంటుంది, కానీ అవి సాధారణ రోడ్లు మాదిరిగా ఉండవు, కొంత ఇరుకుగా, చెట్లు మరియు పొదల పక్కనే వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో పొదల్లో దాక్కున్న కొన్ని జంతువులు దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బాగా నైపుణ్యం వున్న వారు మాత్రమే ఇలాంటి ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడాని ఉపయోగిస్టారు
అంతే కాకుండా పర్యాటకులు అడవిలోకి మరియు రిజర్వ్ ఫారెస్ట్ మార్గాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించే బోర్డులు ఉన్నప్పటికీ, చాలా మంది తమ స్వంత భద్రత గురించి పట్టించుకోకుండా అలాంటి ప్రదేశాలకు వెళుతూనే ఉన్నారు. అటువంటి ప్రయాణాలలో అడవి జంతువులను ఎదుర్కోవడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే అలాంటి సమయంలో ఎలా స్పందించాలో తెలియకుండా పోతుంది, తద్వారా ప్రమాదాలు వస్తాయి.
అంతే కాకుండా ఒకవేల అడవిలోకి వెళ్ళేటప్పుడు అనుభవజ్ఞులైన గైడ్లను తీసుకెళ్లడం ఉత్తమం. అనుభవజ్ఞులైన గైడ్స్ వారిని సమయానికి ప్రమాదం నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. ఇది తప్పకుండా గుర్తుంచోవాల్సిన విషయం.
సాధారణంగా అడవిలో ఏనుగులు చాలా ప్రశాంతమైన జంతువులుగా అభివర్ణిస్తారు. ఎందుకంటే అవి ఎప్పుడు ప్రశాంతంగా వాటి పని అవి చేసుకుంటూ వెళ్లిపోతాయి. అయితే వాటికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వారిపైన దాడి చేయడానికి వెనుకాడవు. కావున అడవి జంతువులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదు.
ఇదిలా ఉండగా ఇటీవల కేరళ ప్రాతంలో ఒక అడవి దున్న ఒక ఆటో రిక్షాపై దాడి చేసి అందరికి భయకంపితులను చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వెలువడింది. రోడ్డుపైన ఆటో రిక్షా వెళ్తున్నపుడు అందులో వెలుగుతున్న ఎల్ఈడీ లైట్లు, మరియు ఆటో లోపల వెలుగుతున్న కలర్ పుల్ లైట్స్ అన్నీ కూడా ఆ అడవి దున్నను భయపెట్టినట్లు అనిపిస్తోంది. ఈ కారణంగానే ఆ అడవి దున్న ఆటోపైన దాడి చేసింది. దీనికి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.
English summary
Anand mahindra given the title to bolero driver as a captain cool details
Story first published: Thursday, September 15, 2022, 18:18 [IST]