Updated: Thursday, September 15, 2022, 12:16 [IST]
దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎన్ని కొత్త ఉత్పత్తులు (బైకులు & కార్లు) పుట్టుకొస్తున్నా.. అవి ముందుకు సాగాలంటే టైర్లు తప్పనిసరిగా అవసరం. అయితే ఇందులో మరో విషయం ఏమిటంటే వెళ్లే వాహనం 'ఆన్ రోడ్ లేదా ఆఫ్ రోడ్' అనేదాన్ని బట్టి దానికి సరైన టైర్లు కావాలి. అప్పుడే వాహన వినియోగదారులు మంచి అనుభూతిని పొందగలరు.
Recommended Video
Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT
దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా టైర్ కంపెనీలు ఆధునిక టైర్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ‘అపోలో’ (Apollo) రెండు కొత్త టైర్లను విడుదల చేసింది. ఈ కొత్త టైర్లను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.
అపోలో టైర్స్బైకుల కోసం విడుదల చేసిన ఈ రెండు కొత్త టైర్లలో ఒకటి 'ట్రాంప్లర్ ఎక్స్ఆర్' (Tramplr XR) కాగా, మరొకటి 'ట్రాంప్లర్ ఎస్టి' (Tramplr ST). ఇందులో అపోలో ట్రాంప్లర్ XR అనేది అడ్వెంచర్ టూరింగ్ బైకుల కోసం 70:30 ఎండ్యూరో ఆఫ్-రోడ్ టైర్. అయితే అపోలో ట్రాంప్లర్ ST డ్యూయల్ స్పోర్ట్స్ సామర్థ్యాల కోసం 80:20 ఎండ్యూరో స్ట్రీట్ టైర్ గా ఉపయోగపడుతుంది.
దేశీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త టైర్లు పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడి, యూరప్ మరియు భారతీయ రోడ్లపైన పరీక్షించబడింది. కావున ఈ కొత్త టైర్లు భారతీయ రోడ్లకు కూడా ఖచ్చితంగా సరిపోయేవిధంగా ఉంటాయి.
అపోలో టైర్స్ యొక్క ఈ రెండు టైర్లు బైకుల యొక్క మైలేజిని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, హ్యాండ్లింగ్ మరియు పనితీరు సామర్థ్యాలను మెరుగుపరచడానికి ట్రెడ్స్, కాంటాక్ట్ ప్యాచ్స్, సైడ్‌వాల్స్, అసిమ్మెట్రీక్ గ్రూవ్స్, టైర్ వేర్ ఇండికేటర్ వంటి ఫీచర్స్ పొందుతాయి. కంపెనీ విడుదల చేసిన ఈ రెండూ జీరో-డిగ్రీ స్టీల్ రేడియల్ బెల్ట్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. కావున ఇవి తప్పకుండా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త టైర్స్ గురించి ఆసియా-పసిఫిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ‘సతీష్ శర్మ’ మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లో ప్రతి రోజు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎక్కువమంది ఆఫ్ రోడింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని రేడియల్ టెక్నాలజీ ఉత్పత్తులయూ విడుదలచేయడం దగ్గరనుంచి ఇప్పుడు ఈ లేటెస్ట్ టైర్లను విడుదల చేయడం వరకు సాగింది అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆధునిక ఉత్పత్తులను తీసుకురావడానికి కూడా కృషి చేస్తామని అన్నారు.
అపోలో ‘ట్రాంప్లర్ ఎక్స్ఆర్’ (Tramplr XR) టైర్లు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, యమహా ఎఫ్‌జెడ్ సిరీస్, సుజుకి జిక్సర్, కెటిఎమ్ బైకులు, బజాజ్ డామినార్ మరియు బిఎమ్డబ్ల్యుజి 310ఆర్ వంటి వాటికి అనుకూలంగా ఉంటాయి. కావున ఈ బైక్ వినియోగదారులు మరింత పటిష్టమైన మరియు మరింత మన్నికైన టైర్స్ కోసం అపోలో బ్రాండ్ ఎంచుకోవచ్చు.
అపోలో ట్రాంప్లర్ ఎక్స్ఆర్ (Tramplr XR) ప్రారంభ ధర రూ. 6,500 (ఒక సెట్ ధర). అయితే పరిమాణం మరియు వేరియంట్ మొదలైన వాటిని బట్టి ధరలు పెరుగుతాయి, అయితే గరిష్ట ధర రూ. 12,000 వరకు ఉన్నాయి.
ఇక ట్రాంప్లర్ ఎస్టి (Tramplr ST) విషయానికి వస్తే, ఇది ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ట్రెడ్ ప్యాటర్న్, సిటీ రైడింగ్ మరియు అన్ని వాతావరణ పరిస్థితులలో ఆఫ్-రోడింగ్ చేయడానికి మెరుగైన వెట్ గ్రిప్ కోసం ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. కావున ఇది ఆఫ్ రోడింగ్ సమయంలో అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే వీటి ధరలు ఒక సెట్‌కు రూ. 4500 మరియు రూ. 6000 మధ్య ఉంటాయి.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
అపోలో టైర్స్ విడుదల చేసిన ఈ కొత్త లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన రెండు టైర్లు 150 సిసి నుంచి 500 సిసి మోటార్ సైకిల్స్ వరకు ఉపయోగపడతాయి. ప్రస్తుతం మార్కెట్లో తన ఉనికిని మరింత పెంచుకోవడానికి మరియు ఆఫ్ రోడింగ్ అవసరాలను తీర్చడానికి కంపెనీ ఈ కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ఈ సంవత్సరం చివరి నాటికి కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మరియు హీరో ఎక్స్‌పల్స్ 200 వంటి 21-ఇంచెస్ ఫ్రంట్-వీల్ మోటార్‌సైకిళ్లకు కూడా టైర్లను విడుదల చేయనున్నట్లు సమాచారం.
English summary
Apollo tyres introduced tramplr range of enduro off road and enduro street tyres details