లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఇద్దరు మైనర్ బాలికలు చెట్టుకు వేలాడుతూ విగత జీవులుగా కనిపించారు. ఈ మధ్యాహ్నం మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో భారీ పోలీసు బలగాలు మోహరించాయి.
మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించినట్లు యూపీ పోలీసులు తెలిపారు. ‘మేము మరణానికి కారణం, సంఘటనల క్రమాన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నాము’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఈ మధ్యాహ్నం మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో భారీ పోలీసు బలగాలు మోహరించారు. సమాచారం అందుకున్న లఖింపూర్ ఖేరీ జిల్లా ఎస్పీ సంజీవ్ సుమన్, అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.