| Published: Thursday, September 15, 2022, 12:38 [IST]
భారత దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయన్స్ jio తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్లను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను అందిస్తుంది. రిలయన్స్ jio దాని అనేక బ్రాడ్‌బ్యాండ్ రీఛార్జ్ ప్లాన్లతో పలు OTT ప్యాక్‌లను అందిస్తుంది.
ఈ ప్లాన్లలో కొన్ని నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్ వంటి OTT సబ్స్క్రిప్షన్లకు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఈ ప్రయోజనాలను పొందవచ్చు. కనిష్టంగా 150 Mbps వేగంతో అపరిమిత హై-స్పీడ్ డేటా, అపరిమిత ఫోన్ కాలింగ్ మరియు ఇతర ఫీచర్లను కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ప్లాన్లు రూపొందించబడ్డాయి. బహుళ OTT సబ్స్క్రిప్షన్లతో JioFiber ప్లాన్లు రూ.999 నుండి ప్రారంభమై.. రూ.8499 (GSTతో సహా) వరకు ఉంటాయి. ఇప్పుడు, జియో ఫైబర్ నుంచి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ మరియు మరిన్ని ఓటీటీలను అందిస్తున్న ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
జియో ఫైబర్ రూ.999 ప్లాన్:
ఈ జియో ఫైబర్ ప్లాన్ 150 Mbps అప్లోడ్ మరియు డౌన్లోడ్ వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. దాని గడువు ముగిసిన 30 రోజులలోపు, ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత Jio యాప్ సబ్స్క్రిప్షన్ మరియు మరిన్నింటిని కూడా అందిస్తుంది. OTT సబ్స్క్రిప్షన్లు అయిన డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీ లివ్, ZEE5, Voot Kids, Sun NXT, Hoichoi, Universal +, Lionsgate Play, Discovery+, JioCinema, ShemarooMe, Eros Now, ALTBalaji, మరియు JioSaavn తో పాటు 1-సంవత్సరం అమెజాన్ ప్రైమ్ వీడియోల సభ్యత్వంతో వస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3.3TB డేటాను పొందుతారు.
జియో ఫైబర్ రూ.1,499 ప్లాన్:
ఈ జియో ఫైబర్ ప్లాన్ ద్వారా 300 Mbps కనెక్షన్ వేగంతో అపరిమిత డేటా ఇంటర్నెట్ ప్యాకేజీ (3.3TB) అందుబాటులో ఉంది. అదనంగా, ఇది ఉచిత వాయిస్ కాలింగ్ అందిస్తోంది. మొదటి 30 రోజులలో Jio యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మెంబర్‌షిప్‌తో పాటు, ఓటీటీలు డిస్నీ+ హాట్‌స్టార్, Voot సెలెక్ట్, Sony Liv, ZEE5, Voot Kids, Sun NXT, Hoichoi, Universal +, Lionsgate Play, Discovery+, JioCinema, ShemarooMe, Erosకి యాక్సెస్‌ని ఇస్తుంది.
జియో ఫైబర్ రూ.2,499 ప్లాన్:
ఈ ప్లాన్ ద్వారా 500 Mbps అప్లోడ్ మరియు డౌన్లోడ్ వేగంతో పాటు అపరిమిత ఇంటర్నెట్ అందిస్తుంది. 30 రోజుల వ్యవధిలో, ఇది అపరిమిత వాయిస్ కాల్లు, ఉచిత Jio యాప్ యక్సెస్ కూడా అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ సబ్స్క్రిప్షన్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మెంబర్షిప్, డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీ లివ్, ZEE5, Voot Kids, Sun NXT, Hoichoi, Universal +, Lionsgate Play, Discovery+, JioCinema, ShemarooMe, Eros Now, ALTBalaji, మరియు JioSaavn లకు యాక్సెస్ ఇస్తుంది. ఈ ప్లాన్ 3.3TB డేటాతో వస్తుంది.
జియో ఫైబర్ రూ.3,999 ప్లాన్:
ఈ ప్లాన్ ద్వారా 1 Gbps అప్లోడ్ మరియు డౌన్లోడ్ వేగంతో పాటు, 3.3TB నెలవారీ డేటా అందిస్తుంది. అదనంగా, ఇది 30 రోజుల ప్లాన్ వాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్లు, Jio అప్లికేషన్లకు ఉచిత యాక్సెస్ మరియు మరిన్నింటిని అందిస్తుంది. OTT ప్యాకేజీలో నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్, అమెజాన్ ప్రైమ్ వీడియోల సబ్స్క్రిప్షన్, అలాగే డిస్నీ+ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, సోనీ లివ్, ZEE5, Voot Kids, Sun NXT, Hoichoi, యూనివర్సల్ +, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+ వంటి ఇతర స్ట్రీమింగ్ సర్వీస్‌లకు సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. అవే కాకుండా JioCinema, ShemarooMe, Eros Now, ALTBalaji మరియు JioSaavn యాక్సెస్ కూడా ఉంది.
జియో ఫైబర్ రూ.8,499 ప్లాన్:
JioFiber యొక్క అత్యంత ఖరీదైన ప్లాన్లలో ఇది ఒకటి. ఇందులో భాగంగా అప్లోడ్లు మరియు డౌన్లోడ్లు రెండింటికీ 1 Gbps ఇంటర్నెట్ వేగంతో 6600 GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ చెల్లుబాటు అయిన మొదటి 30 రోజులలోపు అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత Jio అప్లికేషన్ల సభ్యత్వం అందిస్తున్నారు. OTT బండిల్ నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్, అమెజాన్ ప్రైమ్ వీడియో సభ్యత్వంతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్, Voot సెలెక్ట్, సోనీ లివ్, ZEE5, Voot Kids, Sun NXT, Hoichoi, యూనివర్సల్ +, Lionsgate Play, Discovery+, JioCinema, ShemarooMe, సబ్స్క్రిప్షన్లతో వస్తుంది. ఇవే కాకుండా, Eros Now, ALTBalaji మరియు JioSaavn లకు కూడా యాక్సెస్ కల్పిస్తున్నారు.
Best Mobiles in India
54,999
36,599
39,999
38,990
1,29,900
79,990
38,900
18,999
19,300
69,999
79,900
1,09,999
1,19,900
21,999
1,29,900
12,999
44,999
15,999
7,332
17,091
29,999
7,999
8,999
45,835
77,935
48,030
29,616
57,999
12,670
79,470
English summary
All JioFiber Recharge Plans With OTT plans, you need to know with high speed internet
Story first published: Thursday, September 15, 2022, 12:38 [IST]