అందమైన గాలిమరలతో కూడిన హిల్ స్టేషన్..
రామక్కల్మేడు ప్రసిద్ధ విండ్ ఎనర్జీ ఫారమ్‌కు నిలయంగా ఉంది. ఇది ఇడుక్కిలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. సీజన్‌తో సంబంధం లేకుండా ఇక్కడ వీచే చల్లగాలులు సందర్శకుల మనసును ఊహల్లో విహరించేలా చేస్తాయి. ఒక్క విండ్ ఫామ్ సందర్శన కోసమే రామక్కల్మేడు పర్యటన ప్లాన్ చేయాల్సిన పనిలేదు. ఇక్కడ ట్రెక్కింగ్, పిక్నిక్లు, హైకింగ్ వంటి ఇతర కార్యకలాపాలకూ ప్రసిద్ధిపొందింది. ఎటు చూసినా పచ్చదనం కమ్మేసిన దారులుగుండా విహరించేందుకు రామక్కల్మేడు సందర్శించాల్సిందే.
కేరళలోని ఇడుక్కి జిల్లా పరిధిలో ఉన్న రామక్కల్మేడు ఆసియాలోనే అత్యంత గాలులతో కూడిన ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఏడాది పొడవునా ఇక్కడి గాలి వేగం గంటకు 35 కిలోమీటర్లు ఉంటుంది. అన్ని సమయాలలో బలమైన గాలులు వీయడంతో దానిని ఉపయోగించుకుని, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి పవన క్షేత్రాన్ని ఇక్కడ నిర్మించారు. అందుకే, రామక్కల్మేడు ప్రసిద్ధ విండ్మిల్ ఫామ్‌కు నిలయంగా మారిపోయింది. ఇడుక్కిలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా మారటానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడంలో గొప్పదనం ఏమిటంటే, ఇక్కడ నుండి మీరు తమిళనాడు అద్భుతమైన వీక్షణను చూడవచ్చు. అందుకు కారణం ఈ ప్రాంతం సముద్రమట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉండటని చెబుతారు.
కనువిందు చేసే లోయలు
రామక్కల్మేడుకు గాడ్స్ ఓన్ హిల్ స్టేషన్ అనే మారుపేరుతో కూడా ఉంది. ఈ ప్రదేశం చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసినవారు ఈ పేరు రావడం సముచితమనే భావనకు వస్తారు. హిల్ స్టేషన్ ప్రసిద్ధి చెందింది. అయితే, మున్నార్, వాయనాడ్, తేక్కడి వంటి ప్రదేశాలతో పోల్చుకుంటే చిన్నదనే చెప్పాలి. ఇది చల్లని వాతావరణానికి చిరునామాగా మాత్రం పేరుపొందింది. చల్లని పిల్లగాలులను మనసారా ఆస్వాదించేందుకు ఈ ప్రదేశ పర్యటన ఉత్తమమైన ఎంపికనే చెప్పాలి. పచ్చటి పర్వతాలు, కనువిందు చేసే లోయలు ఈ చిన్న కొండ ప్రాంతాన్నిప్రత్యేక పర్యాటక ప్రదేశంగా మార్చేశాయి. కుటుంబసమేతంగా ఇక్కడ ప్రశాంతమైన సెలవురోజులను ఆస్వాదింవచ్చు.
ప్రచారంలో కొన్ని పురాణాలు కథలు
ఈ చిన్న హిల్ స్టేషన్ల గురించి మరో విషయం కూడా చెప్పుకోవాలి. రామక్కల్మేడు గురించి కొన్ని పురాణాలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం, రాముడు తన భార్య సీతను వెతుకుతూ ఇక్కడికి వచ్చాడు. ఈ ప్రక్రియలో, సుదూరాన్ని గమనించేందుకు ఎత్తయిన రాతిపై తన అడుగు పెట్టాడు. మరో పురాణం ప్రకారం రాముడు మరియు సీత ఇద్దరూ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎత్తయిన రాతితో ఉన్న ఈ స్థలాన్ని సందర్శించారు మరియు వారు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని చెబుతుంటారు.