For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 14, 2022, 11:00 [IST]
Salary Hike: కంపెనీల్లో ఉద్యోగులు సాధారణంగా జీతం విషయంలో లేదా పని విషయంలో సమస్యలు వచ్చినప్పుడు కంపెనీ మారేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఉద్యోగులు వెళ్లిపోకుండా నిలువరించేందుకు కొన్ని కంపెనీలు జీతాల పెంపు ఎరవేస్తుంటాయి.
ఉద్యోగులకు మేలు చేసేందుకు..
అమెరికాలోని ఒక మార్కెటింగ్ ఏజెన్సీ తన ఉద్యోగులకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. వారు పనిమానేసిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉండేదుకు ఒక ప్రత్యేకమైన విధానాన్ని ప్రకటించింది. నోటీసు పీరియడ్లో ఉద్యోగులకు 10% జీతం పెంచుతున్నట్లు వెల్లడించింది.
కంపెనీ వ్యవస్థాపకుడు..
తమ కంపెనీని వీడాలనుకుంటున్న ఉద్యోగులు 3 నెలల నోటీసు పిరియడ్ పనిచేయాలని గొరిల్లా సంస్థ వ్యవస్థాపకుడు జాన్ ఫ్రాంకో వెల్లడించారు. నోటీసు పీరియడ్లో ఉన్న ఫుల్ టైమ్ ఉద్యోగులకు 10 శాతం జీతం పెరుగుతుందని ఆయన వెల్లడించారు. గొరిల్లా వ్యవస్థాపకుడు ఫ్రాంకో తన లింక్డ్ఇన్ పేజీలో ఈ నిర్ణయం గురించి పంచుకున్నారు.
నెట్టింట్లో చర్చ..
అయితే ఉద్యోగులు వెళ్లిపోతున్నప్పుడదు ఈ ప్రోత్సాహం ఎందుకు? అంటూ అనేక మంది నెట్టింట్లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం పెంపు కోసం ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టడం తమకు ఇష్టం లేదని సదరు కంపెనీ చెబుతోంది.
మంచి అవకాశం..
అయితే ఒక ఉద్యోగి ఇటీవల మా వద్దకు వెళ్లాలని చెప్పినట్లు ఫ్రాంకో చెప్పారు. అతని నిర్ణయాన్ని గౌరవించి వెంటనే జీతం 10 శాతం పెంచినట్లు ఆయన తెలిపారు. సదరు ఉద్యోగికి మరో అవకాశం వచ్చి ఉండవచ్చని.. అతని స్థానంలో మరొకరిని నియమించుకుంటున్నట్లు యాజమాన్యం తెలిపింది.
ఖచ్చితంగా..
ఈ ప్లాన్ బాగానే ఉన్నప్పటికీ.. దీన్ని పొందటానికి ఉద్యోగి ముందుగా ఎంతకాలం ఉండాలి? అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. దానికి ఫ్రాంకో బదులిస్తూ.. “మీరు ఈ వేతనం పొందడానికి ముందు మీరు ఎంతకాలం ఉండాలి అనే విషయంలో నేను ఖచ్చితంగా ఉన్నాను” అని బదులిచ్చారు.
నెటిజన్ ప్రశ్న..
ప్రయోజనం పొందిన తర్వాత ఉద్యోగులు ఉండాలని నిర్ణయించుకుంటే ఏమి చేస్తారని ఒక నెటిజన్ ఫ్రాంకోను అడిగారు. దీనికి ఆయన బదులిస్తూ.. ఇప్పటి వరకు అలాంటి సందర్భం తమకు ఎదురుకాలేదని అన్నారు. వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న వ్యక్తి తిరిగి రాలేరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే కొంత మంది విషయంలో కచ్చితంగా ఇలాగే జరగకపోవచ్చని అన్నారు.
English summary
us marketing company gorilla Jon Franko announced 10% salary hike who are in notice period
us marketing company gorilla Jon Franko announced 10% salary hike who are in notice period
Story first published: Wednesday, September 14, 2022, 11:00 [IST]