For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 14, 2022, 16:42 [IST]
Infosys & TCS: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్లకు సంబంధించి రీసెర్చ్ సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ షాకింగ్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో రానున్న స్లోడౌన్ కారణంగా.. ఐటీ రంగంలో నష్టపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో రెండు కంపెనీల స్టాక్లను డౌన్‌గ్రేడ్ చేసింది.
కంపెనీల షేర్లకు SELL రేటింగ్..
దేశీయ టెక్ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, TCS స్టాక్‌లకు గోల్డ్‌మన్ సాక్స్ SELL రేటింగ్ సిఫార్సు చేసింది. ఈ వార్త వెలువడిన నేపథ్యంలో TCS, ఇన్ఫోసిస్ షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. మొత్తం మీద కంపెనీల షేర్లు 8 శాతం మేర నష్టపోయాయి. మరోవైపు.. విప్రో స్టాక్‌పై మాత్రం గోల్డ్‌మన్ సాక్స్ సానుకూలంగా BUY రేటింగ్ అందించింది.
స్టాక్ ధర ఎంత..
TCS స్టాక్ గురించి మాట్లాడితే.. అది 3.15 శాతం కంటే ఎక్కువ తగ్గి రూ.3,130 దిగువన ట్రేడవుతోంది. అదే సమయంలో మార్కెట్ క్యాపిటల్ కూడా రూ.11 లక్షల 45 వేల కోట్లకు చేరువలో ఉంది. ఇన్ఫోసిస్ షేర్ ధర రూ.1,480 స్థాయిలో ఉంది. ఈ స్టాక్ 4.15 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. దీంతో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.6 లక్షల 25 వేల కోట్ల దిగువకు చేరుకుంది.
నివేదికలో చెప్పిన అంశాలు..
ఐటీ కంపెనీల మందగమనం చాలా ముఖ్యమైనదిగా తాము భావిస్తున్నట్లు గోల్డ్‌మ్యాన్ విశ్లేషకులు నివేదికలో వెల్లడించారు. భారతీయ IT కంపెనీల ఆదాయాలతో పోల్చితే EBIT మార్జిన్ అంచనాలను నివేదిక నొక్కి చెప్పింది. శాలరీ స్ట్రక్చర్ నియంత్రణ లేదా వార్షిక పెంపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
అధిక ధర కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి చాలా ఐటి కంపెనీలు లాభాల అంచనాలను మిస్ అవటాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల బోనస్ చెల్లింపులు నిలిపివేయటం లేదా తాత్కాలికంగా రద్దు చేయటం పరిస్థితులకు అద్దం పడుతోందని చెప్పింది.
ప్రభావితమైన ఐటీ స్టాక్‌లు..
ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా ప్రభావితమైన రంగాల్లో ఐటీ ఇండెక్స్ ఒకటి. ఇప్పటి వరకు 27 శాతానికి పైగా పడిపోయింది. అయితే కొన్ని విదేశీ బ్రోకరేజీలు మాత్రం భారతీయ ఐటీ స్టాక్స్‌పై సానుకూలంగా ఉన్నాయి. ఖర్చులను తగ్గించుకోకపోతే కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కోకతప్పదని గోల్డ్‌మన్ సాక్స్ అభిప్రాయపడింది.
English summary
research firm goldman sachs down graded tcs and infosys share amid it sector slowdown
Research firm goldman sachs down graded tcs and infosys share amid it sector slowdown.
Story first published: Wednesday, September 14, 2022, 16:42 [IST]