For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Updated: Wednesday, September 14, 2022, 9:07 [IST]
Tax Deductions: ఆదాయపన్ను రిటర్న్స్ ఫైలింగ్ అనేది అనేక మందికి చాలా క్లిష్టమైన అంశం. చెల్లించాల్సిన పన్నును తగ్గించుకునేందుకు వివిధ పెట్టుబడులను సైతం పెడుతుంటారు. అయితే వీటికి సంబంధించిన నియమాలను సరిగా పాటించకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టాక్స్ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రధాన సమస్య..
ఈ రోజుల్లో చాలా మంది యజమానులు తమ ఉద్యోగులకు ఇన్వెస్ట్ మెంట్ డిక్లరేషన్ ఫారం అందించటం లేదు. దీని కారణంగా చాలా మంది చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీలను క్లెయిమ్ చేస్తున్నారు. అయితే సెక్షన్ 80సీ కింద టాక్స్ ప్రయోజనాలను అందించే వివిధ రైడర్ల గురించి, వాటిని పొందటానికి ఉండే షరతులను గురించి తప్పక తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
హోమ్ లోన్..
టాక్స్ పేయర్స్ ఏడాది కాలంలో తాము తీసుకున్న గృహ రుణాలకు చెల్లించిన ప్రిన్సిపల్ మెుత్తాన్ని సెక్షన్ 80 కింద రాయితీగా పొందవచ్చు. అయితే దీనిని పొందటానికి నియమం ఏమిటంటే.. ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత దానిని 5 ఏళ్ల పాటు విక్రయించకూడదు. ఒక వేళ ఐదేళ్లకు ముందే సదరు ప్రాపర్టీని అమ్మేస్తే.. టాక్స్ ప్రయోజనాలను కోల్పోవలసి ఉంటుంది. దీనికి తోడు అమ్మటం వల్ల వచ్చిన లాభాలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ కూడా చెల్లించాలి.
ఇన్సూరెన్స్..
మార్చి చివరినాటికి పన్ను రాయితీలను పొందాలనే కంగారులో చాలా మంది ఎక్కువగా ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే.. పాలసీ కొన్న తర్వాత రెండేళ్లలోపు పాలసీ చెల్లింపులు మానేస్తే.. అప్పటి వరకు సెక్షన్ 80సీ కింద తీసుకున్న పన్ను రాయితీని అదాయపన్ను శాఖకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
టాక్స్ శ్లాబ్ రేట్లు..
టాక్స్ డిడక్షన్లు రద్దు కావటం వల్ల పన్ను లెక్కింపులో ఆదాయం పెరుగుతుంది. దీని కారణంగా కొన్నిసార్లు టాక్స్ శ్లాబ్ సైతం పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గతంలో కంటే ఎక్కువ టాక్స్ చెల్లించక తప్పదు.
పెన్షన్ ఉపసంహరణ..
వరుసగా రెండేళ్ల పాటు పెన్షన్ ప్లాన్లకు ప్రీమియం చెల్లించకుండా సరెండర్ చేస్తే.. అంతకు ముందు వరకు సెక్షన్ 80సీ కింద పొందిన పన్ను రాయితీలను టాక్స్ పేయర్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
రుజువులు తప్పనిసరి..
ఐటీఆర్ ఫైల్ చేసిన వ్యక్తి తాను సదరు ఆర్థిక సంవత్సరం కింద సెక్షన్-80సీ కింద పొందిన అన్ని టాక్స్ రాయితీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తప్పక కలిగి ఉండాలి. టాక్స్ అధికారులు అసెస్మెంట్ సమయంలో అడిగినప్పుడు వాటిని అందించాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం డాక్యుమెంట్లను మెుత్తం 8 సంవత్సరాల పాటు జాగ్రత్తగా భద్రపరచాలి.
భారీగా పెనాల్టీ..
సెక్షన్-80సీ విషయంలో చట్ట ప్రకారం ఉన్న నియమాలను తప్పక పాటించాలి. దాదాపుగా అన్నీ ప్రభుత్వ పథకాలే ఉన్నందున వాటి సమాచారాన్ని అధికారులు సదరు సంస్థల నుంచి సేకరించి సరిపోల్చి చూస్తుంటారు. వీటన్నింటికీ ఆధార్, పాన్ వంటివి లింక్ అయి ఉంటాయి కాబట్టి తప్పించుకోవటం కుదరదు. ఒకవేళ పొరపాట్లు దొర్లితే టాక్స్ పేయర్ డిసెంబర్ 31లోపు సవరించిన రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టాక్స్ పేయర్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే పెనాల్సీ రేటు పన్ను మెుత్తంలో 50-200 శాతం వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెనాల్టీతో పాటు వడ్డీ, అదనపు పన్ను కూడా విధించబడుతుంది.
English summary
know these ruled to get 80c deductions under income tax act if failed benefits will be reversed
know these ruled to get 80c deductions under income tax act if failed benefits will be reversed