For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 14, 2022, 13:09 [IST]
Harsha Engineers IPO: ఈ మధ్య కాలంలో మళ్లీ వరుసగా ఐపీవోలు మార్కెట్లకు క్యూ కడుతున్నాయి. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు వస్తున్నవి కొంత మంచి రాబడులను అందిస్తూ.. మంచి పనితీరును కనబరుస్తున్నాయి. తాజాగా ఈ రోజు మరో ఐపీవో ఇన్వెస్టర్ల కోసం అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీవో వివరాలు..
తాజాగా మార్కెట్లోకి ఐపీవోగా వస్తున్న కంపెనీ హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్. IPO ఈ రోజు సెప్టెంబర్ 14, 2022 పబ్లిక్ సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడింది. సెప్టెంబర్ 17 వరకు ఈ ఇష్యూలో ఇన్వెస్టర్లు షేర్ల కోసం అప్లై చేయవచ్చు. హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ IPO ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.314 - రూ.330గా నిర్ణయించబడింది. కంపెనీ ఐపీఓలో రూ.455 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. IPOలో ఇప్పటికే ఉన్న వాటాదారుల ద్వారా రూ.300 కోట్ల వరకు ఆఫర్-ఫర్-సేల్ (OFS) కూడా ఉంది.
భారీగా గ్రే మార్కెట్ ప్రీమియం..
మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం హర్ష ఇంజనీర్స్ షేర్లు ఈ రోజు గ్రే మార్కెట్లో రూ.210 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ షేర్లను సెప్టెంబర్ 26, 2022న BSE, NSEలో లిస్ట్ చేయవచ్చు.
కంపెనీ ప్రమోటర్లు..
ఆఫర్ ఫర్ సేల్ లో భాగంగా రాజేంద్ర షా రూ.66.75 కోట్లు, హరీష్ రంగ్వాలా రూ.75 కోట్లు, పిలక్ షా రూ.16.50 కోట్లు, చారుశీల రంగ్వాలా రూ.75 కోట్లు, నిర్మలా షా రూ.66.75 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
IPO ఆదాయం దేనికి వినియోగిస్తారంటే..
కంపెనీ IPO ద్వారా వచ్చే ఆదాయాన్ని అప్పుల చెల్లింపులు, కొత్త యంత్రాల కొనుగోలు, మౌలిక సదుపాయాల మరమ్మతులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇప్పటికే ఉన్న ఉత్పత్తి సౌకర్యాల పునరుద్ధరణ వంటి అవసరాల కోసం వినియోగించనుంది.
ఐపీవోపై బ్రోకరేజ్ మాట..
హర్ష ఇంజనీర్స్ దాని ఫ్లాగ్షిప్ పొజిషన్‌తో పరిశ్రమల్లో పెరుగుతున్న బేరింగ్ కేజ్ డిమాండ్‌ను తీర్చడానికి మంచి స్థానంలో కంపెనీ ఉందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ అభిప్రాయపడింది. కంపెనీ మార్జిన్లను పెంచుకునేందుకు ఈవీ సెగ్మెంట్‌పై దృష్టి పడుతోంది. ఆటో రంగంలో వృద్ధిలో రికవరీ, మిడ్‌క్యాప్‌లలో బలమైన మొమెంటం కారణంగా ఐపీవో మంచి పనితీరును కనబరుస్తుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. లిస్టింగ్ బెనిఫిట్స్ కోసం సబ్స్క్రయిబ్ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు సిఫార్సు చేసింది.
English summary
Harsha Engineers IPO opened for subscription from today brokerage gave buy with high gmp
Harsha Engineers IPO opened for subscription from today brokerage gave buy with high gmp
Story first published: Wednesday, September 14, 2022, 13:09 [IST]