For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 14, 2022, 17:42 [IST]
DB Realty: అనేక రంగాల్లో కంపెనీలను కొంటూ దండయాత్ర చేస్తున్న గౌతమ్ అదానీ కన్ను ఇప్పుడు బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలాకు ఇష్టమైన కంపెనీ మీద పడింది. దీంతో దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్ చేసేందుకు అదానీ సిద్ధమయ్యారు. బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన లగ్జరీ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాపర్టీ కంపెనీ అదానీ రియాల్టీ ముంబైకి చెందిన DB రియాల్టీని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.
పెరుగుతున్న స్టాక్..
ఈ భారీ డీల్ కుదుర్చుకునేందుకు రెండు సంస్థల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అదానీ రియల్టీ ముంబైకి చెందిన DB రియల్టీతో చర్చలు జరుపుతోంది. ఒప్పందం కుదిరితే DB రియల్టీ పేరు అదానీ రియల్టీగా మార్చబడుతుంది. దేశంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రియాల్టీ డీల్ కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగా రెండు రోజులుగా DB రియల్టీ షేర్లు అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి.
ముంబైని ఏలటానికి..
DB రియాల్టీ కంపెనీకి 100 మిలియన్ చదరపు అడుగులు, 628 ఎకరాల ప్రైమ్ రియల్ ఎస్టేట్‌ను కలిగి ఉంది. ఈ కంపెనీ ఆస్తులు చాలా వరకు ముంబైలోనే ఉన్నాయి. విలీన ఒప్పందం పూర్తయిన తర్వాత అదానీ రియల్టీకి లిస్టింగ్ సౌకర్యం లభిస్తుంది. డిబి రియాల్టీలో వినోద్ గోయెంకా నేతృత్వంలోని ప్రమోటర్లు, బల్వా ఫ్యామిలీ, మరికొందరు కంపెనీలో దాదాపు 69 శాతం వాటాను కలిగి ఉన్నారు.
బిగ్ బుల్ ఫేవరెట్ స్టాక్..
గత నెలలో మరణించిన దివంగత ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా, అతని భార్య రేఖా జున్‌జున్‌వాలా జూన్ 30, 2022 నాటికి కంపెనీలో 50,00,000 లక్షల ఈక్విటీ షేర్లు లేదా 1.73 శాతం వాటాను కలిగి ఉన్నారు. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ స్టాక్ 12.79 శాతం లాభపడింది. ఏడాది ప్రాతిపదికన ఈ ఏడాది షేరు 101.94 శాతం లాభపడగా.. గత ఏడాది కాలంలో షేరు ధర 228.62 శాతం పెరిగింది. ఈ రోజు స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.98.75 వద్ద ఉంది.
English summary
adani realty in talks to merge mumbai realty company with buyout led rally in db realty stock
adani realty in talks to merge mumbai realty company with buyout led rally in db realty stock
Story first published: Wednesday, September 14, 2022, 17:42 [IST]