For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
| Published: Wednesday, September 14, 2022, 15:01 [IST]
Billionaires Loss: అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గకపోవటంతో వాల్ స్ట్రీస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా ఊహించని రీతిలో క్రాష్ అయ్యాయి. ఈ ప్రభావం నేడు భారత మార్కెట్లపై కూడా పడింది. దీంతో ప్రపంచ కుబేరుల సంపద భారీగా ఆవిరైంది.
అగ్రరాజ్యంలో పరిస్థితి..
అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్లో ద్రవ్యోల్బణం ఆగస్టులో 8.3 శాతంగా నమోదైంది. ఇది అక్కడి నిపుణుల అంచనాలను మించిపోయింది. ఈ గణాంకాలతో ఫెడ్ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను మళ్లీ పెంచటానికి మార్గం సుగమం అయింది. ఈ అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మెుగ్గుచూపారు. ఫలితంగా డౌ జోన్స్ దాదాపు 1200 పాయింట్లు పడిపోయింది.
రూ.7.40 లక్షల కోట్లు ఆవిరి..
మంగళవారం నాటి ట్రేడింగ్‌లో అమెరికా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను నమోదు చేయటంతో ధనవంతుల సంపద ఆవిరైంది. దీంతో యూఎస్ స్టాక్ మార్కెట్ చరిత్రలో 9వ అతిపెద్ద ఒక్కరోజు నష్టంగా నిలిచింది. దీంతో సంపన్నులు ఏకంగా రూ.7.40 లక్షల కోట్లు కోల్పోయారు.
జెబ్ బెజోస్..
US రిచ్ లిస్ట్‌లో నిన్నటి క్షీణత కారణంగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారీ నష్టాన్ని చవిచూశారు. అతని నికర విలువ మంగళవారం ఒక్కరోజే రూ.80 వేల కోట్లు కోల్పోయారు. దీంతో అతని మొత్తం సంపద 150 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
ప్రపంచ కుబేరుడు..
అదేవిధంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ రూ.70 వేల కోట్లు నష్టపోగా, మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్, స్టీవ్ పామర్ 4 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయారు. అలాగే వారెన్ బఫెట్ 3.4 బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 2.8 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల విలువ ఏడాది ప్రారంభంలో కంటే 1.2 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గింది.
మార్క్ జుకర్‌బర్గ్..
మార్కెట్ క్రాష్ కారణంగా మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ 68.3 బిలియన్ డాలర్లను కోల్పోయారు. నికర విలువలో దాదాపు 54 శాతం ఆవిరైంది. ఇదే సమయంలో Binance CEO చాంగ్‌పెంగ్ జావో సంపదలో 61 బిలియన్ డాలర్లు తగ్గిపోయింది. ఇది చాంగ్‌పెంగ్ నికర విలువలో 64 శాతం తగ్గింపు.
English summary
us billionaires lost 7.40 lakh crores with markets crash in wall street amid inflation data released
us billionaires lost 7.40 lakh crores with markets crash in wall street amid inflation data released..
Story first published: Wednesday, September 14, 2022, 15:01 [IST]