విమానశ్రయాన్ని తలదన్నే సౌకర్యాలున్న రైల్వేస్టేషన్..
రాణి కమలాపతి రైల్వే స్టేషన్. ఈ పేరు ఇప్పటివరకూ మీరు పెద్దగా విని ఉండరు. అయితే, ఇది రైల్వే స్టేషన్‌గా మాత్రమే కాకుండా విలాసవంతమైన, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే స్టేషన్‌గా మీ ముందుకు రానుంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వసతుల గొప్పతనాన్ని చూస్తే, అందరి కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే, ఈ రైల్వే స్టేషన్ ఎయిర్‌పోర్టులా ఉంటుందని చెబితే మీరు నమ్మరు. అటువంటి స్టేషన్ గురించి ఈరోజు మేం మీకు చెప్పాలనుకుంటున్నాం. ఈ స్టేషన్ గురించి తెలుసుకోండి.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో అలాంటి రైల్వే స్టేషన్ ఒకటి పూర్తయింది. ఇది హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్. దీనికి రాణి కమలాపతి రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. నవంబర్ 15న ఈ స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ప్రైవేట్ మరియు ప్రభుత్వ భాగస్వామ్యంలో (PPP) నిర్మించిన దేశంలోనే తొలి స్టేషన్ ఇది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం దీనిని ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ స్టేషన్లో ఎక్కి, దిగే ప్రయాణికుల కోసం రెండు వేర్వేరు నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్టేషన్ వైభవాన్ని చూసిన వారికి ఎవరకైనా కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
రైల్వే స్టేషన్లలో ప్రధాన సమస్య లగేజీతో ప్లాట్‌ఫారమ్‌కు చేరుకోవడం. ఈ సమస్య హబీబ్‌గంజ్ స్టేషన్లో కనిపించదు. ప్రయాణికులు లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ద్వారా ప్లాట్‌ఫారమ్ మరియు స్టేషన్‌కు లగేజ్‌తోపాటు నేరుగా చేరుకోవచ్చు. హబీబ్‌గంజ్ స్టేషన్లో ఒక ఎయిర్కోర్సు ఏర్పాటు చేయబడింది. ఇక్కడ సుమారు ఏడువందల మంది ప్రయాణికులు ఒకేసారి రైలు కోసం కూర్చుని వేచి ఉండగలరు. స్టేషన్ ఆవరణలో ఎల్ఈడీలను ఏర్పాటు చేయడంతో రైలు కదలికలపై నిత్యం సమాచారం అందుతుంది. దీంతో పాటు వినోదం కోసం అనేక సౌకర్యాలు కూడా కల్పించారు. స్టేషన్ యొక్క ప్రతి మార్గంలనూ ఎస్కలేటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. టికెట్ కౌంటర్‌ను ఆధునీకరించడంతోపాటు సులువుగా టికెట్లు అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా స్థలం కూడా ఏర్పాటు చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ టిక్కెట్లు ఇచ్చేలా వ్యవస్థను వేగవంతం చేశారు.
స్టేషన్లో ప్రయాణీకులు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి ఒక రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఏసీ గదులతోపాటు ఏసీ లాంజ్‌లు అందుబాటులో ఉంచారు. అన్ని సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గదులు మరియు వసతి గృహాలు అధునాతనంగా తయారు చేయబడ్డాయి. ఇక్కడ ప్రయాణీకులు ప్రయాణానికి ముందు ఉండేందుకు అనువుగా ఉంటుంది. అంతేకాదు, భద్రత దృష్ట్యా ప్రతిచోటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు మొత్తం స్టేషన్ ఆవరణలో 24 గంటలూ నిఘా ఉంచుతాయి. స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగితే ప్రయాణికులను ఎలా రక్షించాలి, తక్కువ సమయంలో రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు సురక్షితంగా మరియు విజయవంతంగా నిర్వహించాలి లాంటి పూర్తి సన్నాహాలు చేశారు. విపత్తు సమయంలో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే హబీబ్‌గంజ్ స్టేషన్ పూర్తిగా సౌరశక్తితో నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ఇచ్చిన ఆదేశాల మేరకు దేశంలోని దాదాపు అన్ని స్టేషన్లలో సౌర విద్యుత్తును ఏర్పాటు చేయనున్నారు. దీంతో బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. నవంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.