Latest Posts

పారాగ్లైడింగ్ సాహ‌స‌క్రీడ‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే ప్ర‌దేశాలు

పారాగ్లైడింగ్ సాహ‌స‌క్రీడ‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే ప్ర‌దేశాలు

మీకు పారాగ్లైడింగ్ పట్ల ఆస‌క్తి ఉంటే భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను సందర్శించడం అస్స‌లు మర్చిపోవద్దు. గత కొన్నేళ్లుగా ఈ ప్ర‌దేశాల‌కు వ‌చ్చే ప‌ర్యాట‌కుల సంఖ్య పెరగుతూ వ‌స్తోంది. అందుకు ప్ర‌ధాన కార‌ణం సంద‌ర్శ‌కుల‌కు సాహస క్రీడల పట్ల క్రేజ్ పెర‌గ‌డ‌మే. పారాగ్లైడింగ్, డైవింగ్, బంగీ జంపింగ్ మొదలైన క్రీడలు గత 10-15 ఏళ్లలో ప్రాచుర్యం పొందాయి.

దీంతో చాలా ప్రదేశాలు ఇలాంటి వారిని ఆక‌ర్షించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి రోజుల్లో పారాగ్లైడింగ్ వంటి క్రీడ బాగా ప్రాచుర్యం పొందింది. మ‌న దేశంలోని అలాంటి కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా ఈ క్రింది ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించండి.

         బిర్ బిల్లింగ్, హిమాచల్ ప్రదేశ్

బిర్ బిల్లింగ్, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ బిల్లింగ్ భారతదేశంలో పారాగ్లైడింగ్ కోసం ఉత్తమమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అందుకే ఇక్కడ చాలా మంది పారాగ్లైడింగ్ ఆపరేటర్లు అందుబాటులో ఉన్నారు. బిల్లింగ్ టేకాఫ్ పాయింట్ సముద్ర మట్టానికి సుమారు 8000 అడుగుల ఎత్తులో మరియు 4000 అడుగుల ఎత్తులో ల్యాండ్ అయిన ఆసియాలో అత్యంత ఎత్త‌యిన ప్రదేశంగా మరియు ప్రపంచంలో రెండవ ఎత్త‌యిన ప్రదేశంగా ప్ర‌సిద్ధిగాంచింది. మీరు ఈ థ్రిల్‌తో కూడిన అనుభవాన్ని పొందాలనుకుంటే, బిర్ బిల్లింగ్ మీకు సరైన ప్రదేశం. మీరు ప్రొఫెషనల్ పారాగ్లైడర్ కాకపోతే, ముందుగా టెన్‌డం ఫ్లైయింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బిర్ బిల్లింగ్‌లో పారాగ్లైడింగ్ చేయడానికి అక్టోబర్ నుండి జూన్ వరకు ఉత్తమ సమయం. పంచగని, మహారాష్ట్ర

పంచగని, మహారాష్ట్ర

మ‌హారాష్ట్ర‌లోని పంచ‌గ‌ని ప్ర‌దేశం పారాగ్లైడింగ్ శిక్షణకు మరియు ఫ్లయింగ్‌కు రెండింటికీ ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడి మైదానాలు, పచ్చదనం, అందమైన కొండలు మరియు శిఖరాలు దీనిని గొప్ప పారాగ్లైడింగ్ గమ్యస్థానంగా మార్చాయి. ఇది కాకుండా, టెన్‌డం విమానాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. దీనిప‌ట్ల ఆస‌క్తి ఉన్న‌వారికోసం పంచగనిలో తపోలా, ఖింగార్ మరియు భిలార్ వంటి అనేక టేకాఫ్ పాయింట్లు ఉన్నాయి. శిక్షణ తర్వాత ఇక్కడ సోలో జంప్‌లు చేస్తారు. మీరు పంచగనిలో పారాగ్లైడింగ్ ను మ‌న‌సారా ఆస్వాదించవచ్చు. కాబట్టి ఈ సీజ‌న్‌లో మీ స్నేహితులతో పంచగని సందర్శించడం మర్చిపోవద్దు. షిల్లాంగ్, మేఘాలయ

షిల్లాంగ్, మేఘాలయ

మేఘాలయ మంచుతో కప్పబడిన పర్వతాలు, ఎత్త‌యిన‌ చెట్లు మరియు విశాలమైన విస్తీర్ణం కారణంగా ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది. మీరు ఇక్కడ పారాగ్లైడింగ్‌కు వెళ్లినప్పుడు, ఆకాశంలోని పక్షులను ప‌ల‌క‌రించే అనుభూతులు క‌లుగుతాయి. ఇక్క‌డి అందమైన ప్రకృతి దృశ్యం పారాగ్లైడింగ్ కోసమే రూపుదిద్దకుండా అనేంత‌గా ఆస‌క్తిని రేకెత్తించేలా ఉంటుంది. పారాగ్లైడింగ్ కార‌ణంగా ఈ ప్ర‌దేశం ఖచ్చితంగా ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతోంది. ప‌ర్యాట‌క‌ మరియు సాహస ప్రియులను ఆకర్షిస్తుంది. ఇక్క‌డ పారాగ్లైడింగ్‌కు వేసవి కాలం ఉత్తమమైనది. మనాలి, హిమాచల్ ప్రదేశ్

మనాలి, హిమాచల్ ప్రదేశ్

మనాలి పర్యాటక ప్ర‌దేశంగా చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం అనేక‌మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సోలాంగ్ వ్యాలీ , ఫటారు హిల్ మొదలైన ప్రదేశాలలో ఇక్కడ పారాగ్లైడింగ్ ఆనందించవచ్చు. వర్షాకాలంలో ఇక్కడ పారాగ్లైడింగ్ చేయడం చాలా క‌ష్టం. ఇత‌ర‌ సీజన్‌లో పారాగ్లైడింగ్‌కు వెళ్లవచ్చు. ఇక్క‌డి ఈ సాహసం క్రీడ‌ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంద‌ని మాత్రం క‌చ్చితంగా చెప్పొచ్చు. ఇది కాకుండా, సోలాంగ్ వ్యాలీలో అనేక ఇతర క్రీడలు కూడా నిర్వహించబడుతున్నాయి. మీరు వాటిని పూర్తిగా ఆస్వాదించ‌వ‌చ్చు.

నంది హిల్స్, బెంగళూరు

నంది హిల్స్, బెంగళూరు

బెంగుళూరు నుండి కొద్ది దూరంలో ఉన్న ఈ అందమైన హిల్ స్టేషన్ ఖచ్చితంగా కళ్లకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మీరు నంది హిల్స్‌కు వస్తే, ఈ ప్రాంతంలో పారాగ్లైడింగ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ పారాగ్లైడింగ్ బాగా ప్రాచుర్యం పొందింది. మీరు సముద్ర మట్టానికి సుమారు 1400 మీటర్ల ఎత్తులో గాలిలో ఉన్నప్పుడు, పచ్చని పరిసరాలను ఆస్వాదిస్తూ.. రిలాక్స్‌గా ఉంటారు. అందమైన కొండల న‌డుమ‌, పచ్చని ఒడిలోకి కాలుమోపిన అనుభూతి క‌లుగుతుంది. ఈ ప్రాంతంలో పారాగ్లైడింగ్ కాకుండా అనేక రకాల థ్రిల్లింగ్ యాక్టివిటీస్ చేసే అవకాశం ఉంది.

Latest Posts

Don't Miss