| Published: Wednesday, September 14, 2022, 11:07 [IST]
భారత దేశంలో పండగ సీజన్ సమీపిస్తుండటంతో చాలా కంపెనీలు ప్రత్యేక ఆఫర్ సేల్ కు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలైన ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ సెప్టెంబర్ 23 నుండి తమ ఫెస్టివల్ సీజన్ సేల్స్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ Poco కాస్త ముందుగానే, ఎర్లీ బర్డ్ ఫెస్టివల్ సేల్ పేరుతో Poco దీపావళి ఆఫర్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా, Poco X4 Pro 5G, Poco M4 Pro 5G మరియు Poco M5తో సహా బ్రాండ్ నుండి అనేక మొబైల్స్‌పై తగ్గింపుతో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.
Poco భారతీయ వినియోగదారుల కోసం దీపావళి ప్రారంభ విక్రయాలను అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్కు ముందే.. పైన పేర్కొన్న Poco స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, Poco దీపావళి ఆఫర్ ఈరోజు సెప్టెంబర్ 13 నుండి అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా పోకో ఏయే మొబైల్స్‌పై తగ్గింపు అందిస్తోంది.. ఏ మేర ఆఫర్లు ఉన్నాయి అనే విషయాల్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
poco దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు:
Poco X4 Pro 5G పై ఆఫర్లు ఇలా:
Poco దీపావళి ఆఫర్లో భాగంగా, Poco X4 Pro 5G మూడు వేరియంట్లపై రూ.5,000 తగ్గింపు ధరను కంపెనీ ఆఫర్ చేస్తోంది. కాగా, ఈ మొబైల్ రూ.13,999 ప్రారంభ ధర నుండి అందుబాటులో ఉంటుంది. ఈ డిస్కౌంట్లో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. Poco X4 Pro 5G మొబైల్ శక్తివంతమైన Qualcomm Snapdragon 695 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దాని వెనుక భాగంలో 64MP ట్రిపుల్-కెమెరా సిస్టమ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ప్లే మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో అమర్చబడింది. స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర అంశాలలో గ్లాస్ రియర్ ప్యానెల్ మరియు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
Poco M4 Pro 5G పై ఆఫర్లు ఇలా:
Poco M4 Pro 5G యొక్క 4GB మరియు 6GB వేరియంట్‌పై రూ.3,500 తగ్గింపు, మరియు 8GB వేరియంట్ పై అధికంగా రూ.4,500 తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.11,499 నుండి ప్రారంభమవుతుంది. ఈ డిస్కౌంట్లు బ్యాంక్ ఆఫర్లతో కలుపుకుని ఉన్నాయి. Poco M4 Pro 5G విషయానికి వస్తే, పరికరం 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర అంశాలలో MediaTek డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్ మరియు 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి.
Poco M5 పై ఆఫర్లు ఇలా:
చివరగా, ఈరోజు మొదటిసారిగా సేల్ ప్రారంభించబడిన Poco M5 రెండు వేరియంట్లపై బ్యాంక్ ఆఫర్లతో సహా రూ.1,500 తగ్గింపు అందిస్తున్నారు. దీని ప్రారంభ ధర రూ.12,499 గా ఉంది. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు వార్షిక డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్, ఆరు నెలల స్క్రీన్ ప్రొటెక్షన్ మరియు సూపర్ కాయిన్లపై రూ.500 వరకు అదనపు తగ్గింపును పొందుతారు. Poco M5 MediaTek Helio G99 SoC ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ డిస్ప్లే మరియు దాని వెనుక భాగంలో ప్రీమియం లెదర్ లాంటి ఆకృతి ఉంటుంది.
Best Mobiles in India
54,999
36,599
39,999
38,990
1,29,900
79,990
38,900
18,999
19,300
69,999
79,900
1,09,999
1,19,900
21,999
1,29,900
12,999
44,999
15,999
7,332
17,091
29,999
7,999
8,999
45,835
77,935
48,030
29,616
57,999
12,670
79,470
English summary
Poco Diwali Sale Offers Massive Discounts On Select Smartphones
Story first published: Wednesday, September 14, 2022, 11:07 [IST]