Latest Posts

Stock Market: రంకెలేస్తున్న బుల్.. లాభాల్లో దూసుకుపోతున్న మార్కెట్లు.. లాభాల్లో స్టాక్స్..

బుల్ సెంటిమెంట్..

ఉదయం 10 గంటల సమయంలో కీలక సూచీలు పచ్చ రంగు అద్దుకుని పైకి ఎగబాకుతున్నాయి. మార్కెట్లు బులిష్ మెుమెంటంను కొనసాగిస్తున్నందున కీలక సూచీ సెన్సెక్స్ 512 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే సమయంలో మరో బెంచ్ మార్కె సూచీ నిఫ్టీ 147 పాయింట్ల వృద్ధిలో కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 490 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 195 పాయింట్ల లాభంలో ఉన్నాయి.

టాప్ గెయినర్స్..

ఈ రోజు ఆరంభ ట్రేడింగ్ సమయంలో బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, శ్రీ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు లాభపడి టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..

ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, సిప్లా, హిందాల్కొ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు ఆరంభంలో నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ కారణంగా అవి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.

Latest Posts

Don't Miss