రూ.5 లక్షలు గెలుచుకుంది..
మీకు నచ్చిన పని చేసినందుకు జీతం పొందడం లాంటిది ఏమీ లేదు. మీ ఉద్యోగంలో పడుకున్నందుకు జీతం పొందడం గురించి ఆలోచించండి. పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాకు చెందిన 26 ఏళ్ల త్రిపర్ణ చక్రవర్తి ఇలా తన డ్రీమ్ జాబ్ పొందింది. అలా నిద్రపోయినందుకు ఏకంగా ఆగస్టు 24న రూ.5 లక్షలు గెలుచుకుంది.
బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ..
చక్రవర్తి Wakefit.co కంపెనీ అందిస్తున్న ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దేశంలో అనేక మంది నిద్రలేమితో బాధపడుతున్నందున వారికి మంచి బెడ్ సౌకర్యాలపై అధ్యయం చేసి ఉత్తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు కంపెనీ చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ పోటీని నిర్వహిస్తోంది. టైటిల్ గెలవడానికి ఆమె 100 రోజుల పాటు నిరంతరాయంగా రోజుకు 9 గంటల పాటు నిద్రపోయింది. హౌరా నివాసి, త్రిపర్ణ లైవ్ స్లీప్-ఆఫ్‌లో చివరికి విజేతగా నిలిచింది. అలా పోటీలో నిలిచిన నలుగురిని ఓడించింది.
త్రిపర్ణ ఏమంటోందంటే..
దీనిని సరైన స్థలంలో, సరైన సమయంలో, సరైన వ్యక్తికి సంబంధించిన పోటీగా దీనిని భావిస్తున్నట్లు సంతోషం వ్యక్తం చేసింది. మెుత్తం 5.5 లక్షల మంది దరఖాస్తుదారుల్లో విజేతగా నిలవటంపై ఆనందంగా ఉంది.
View this post on Instagram A post shared by Wakefit Solutions (@wakefitco)
ఛాంపియన్ కిరీటం..
‘ది ఫస్ట్ స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా’ కిరీటం త్రిపర్ణ జీవితంలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిలో నిద్ర ఆవశ్యకతను ప్రతిబింబిస్తోంది. “డబ్బు అనేది ఉద్యోగానికి ఉత్తేజకరమైన పెర్క్ అయితే.. మనశ్శాంతితో పాటు విజయానికి మంచి 8 గంటల నిద్ర జీవితంలో ముఖ్యమైన భాగమని ప్రతి ఒక్కరికీ తప్పనిసరి” అని ఆమె అన్నారు. ఆమె ఆరోగ్యకమైన రాత్రి నిద్ర కోసం పాటించిన రొటీన్‌ను, అందుకోసం అవసరమైన నైపుణ్యాలను క్లుప్తంగా తెలియజేసింది.
Wakefit మరో అవకాశం..
వేక్‌ఫిట్ ఆగస్టు 24న ‘స్లీప్ ఇంటర్న్‌షిప్ సీజన్- 2 బ్యాచ్ ఆఫ్ 2021’ విజేతను ప్రకటించింది. దాని మొదటి సీజన్లో ఈ పోటీకి దాదాపు 1.7 లక్షల మంది దరఖాస్తుదారులు ఆసక్తి చూపారు. 100 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం నాణ్యమైన నిద్రపై అవగాహన కల్పించడమని కంపెనీ చెబుతోంది. Wakefit సీజన్- 3 కోసం దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. ఇక్కడ విజేతకు ప్రతి రాత్రి 9 గంటల పాటు 100 రాత్రులు గాఢంగా నిద్రించినందుకు గరిష్ఠంగా రూ.10 లక్షలు చెల్లించబడుతుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో పాల్గొనాలనుకునేవారు కంపెనీ అధికారిక వెబ్ సైట్ లేదా Instagram ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.