స్టేట్ బ్యాంక్..
కర్ణాటకలోని ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఉద్యోగి చేసిన తప్పుకు.. ధార్వాడ్ జిల్లా వినియోగదారుల గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరమ్ రూ.85,177 జరిమానా విధించింది. చెక్‌పై కన్నడలో రాసిన సంఖ్యను సరిగ్గా గుర్తించడంలో విఫలమైనందుకు ఇలా చేయాల్సి వచ్చింది.
బ్యాంక్ చేసిన తప్పు ఇదే..
వాదిరాజాచార్య ఇనామ్దార్ తన విద్యుత్ బిల్లుకు సెప్టెంబర్ 3, 2020న హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్(HESCOM) రూ.6,000కి SBI చెక్కును ఇచ్చారు. హెస్కామ్కి కెనరా బ్యాంక్‌లో ఖాతా ఉంది. కాబట్టి.. చెక్కును క్లియరెన్స్ కోసం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని హలియాల్లోని ఎస్బీఐ బ్రాంచ్‌కు పంపారు. చెక్కు సంఖ్యలతో సహా కన్నడలో నింపబడింది.
నెలను తప్పుగా గుర్తించటంతో..
హలియాల్లోని SBI బ్రాంచ్ కన్నడ సంఖ్య తొమ్మిదిని.. ఆరుగా భావింతటం వల్ల చెక్ డిస్‌హానర్ అయింది. ఇక్కడ.. తొమ్మిది సంఖ్య సెప్టెంబరు నెలను సూచించింది. అయితే బ్యాంక్ ఉద్యోగులు దానిని జూన్గా అర్థం చేసుకున్నారు.
కోర్టుకెళ్లిన మాస్టారు..
హుబ్బళ్లిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకుడు ఇనామ్దార్ తన ఫిర్యాదుతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై పూర్తి వాదోపవాదాలు ముగిసిన తరువాత బుధవారం.. అధ్యక్షుడు ఈశప్ప భూటే, సభ్యులు VA బొలిశెట్టి, P C హిరేమత్‌లతో కూడిన ఫోరమ్ SBI తన సేవలో లోపాన్ని గుర్తించి జరిమానా విధించింది.